యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. దీనిలో ఆయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎలాగో ఇవ్వలేదు కనీసం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అయినా ఇవ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే పైసలు మీకే అని కొద్దిరోజుల క్రితం అన్నాను... ఎవరినన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ని అన్నాను తెలుసు కదా అని కార్యకర్తలతో కోమటిరెడ్డి అన్నారు. మన మునుగోడులో నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు సిసి రోడ్డు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా కూడా రాలే.. వందసార్లు తిరిగినా రాలేదు అంటూ ఆయన మండిపడ్డారు.
Also Read: Swiggy: మళ్ళీ స్విగ్గీ వాయింపు ..భారీగా ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు
నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వండి..
కాంట్రాక్టర్లు వలిగొండ చౌటుప్పల్ రోడ్డు చేయడం లేదు... పని చేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించమని అంటున్నారు అన్నారు కోమటిరెడ్డ రాజగోపాలరెడ్డి. బిల్లు ఏమో నా చేతిలో లేదు...ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. నేను ముఖ్యమంత్రిని విమర్శించలేదు.. పార్టీని విమర్శించలేదు..కానీ ప్రజలు నన్ను పని చేయమని అడుగుతున్నారు. పదవులలో మీరే ఉంటారు..పైసలూ మీరే తీసుకుంటారు. మీ నియోజకవర్గాలకు పైసలు పోతున్నాయి... కనీసం నాకు పదవి ఇవ్వనందుకు మా నియోజకవర్గానికి డబ్బులు అయినా ఇవ్వండి అని కోమటి రెడ్డి విమర్శించారు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి.. మునుగోడు నియోజకవర్గం సహకరించండి అంటూ విజ్ఞప్తి చేశారు. ప్రజలు కోసం తనకు అన్యాయమైనా పర్వాలేదన చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచివారిని ఎన్నుకోండి... నాతోపాటు ఉంటే నేను పోరాడుతాను.. మళ్లీ ఎక్కడికైనా పోతే రమ్మంటే మళ్ళీ డబ్బులు అడిగే వారిని ఎన్నుకోకుండా మంచివారిని ఎన్నుకోండి అని అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు..
Also Read: Trump: నా మాట వింటేనే..రష్యాతో వ్యాపారం..భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
TS: పదవులు మీకే..పైసలు మీకే..కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తనకు పదవి ఎలాగో ఇవ్వలేదు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులైనా మంజూరు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. పదవులు మీకే, పైసలు మీకే అంటూ వ్యాఖ్యలు చేశారు.