Lucky Draw: అబుధాబి లాటరీలో ఇండియన్ కు 60 కోట్లు

యూఏఈలోని ఓ ప్రవాస భారతీయుడికి అదృష్టం వరించింది. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లాటరీ అయిన ‘బిగ్‌ టికెట్‌ అబుధాబి 280’ సిరీస్‌లో ప్రవాస భారతీయుడు అయిన శరవణన్‌ వెంకటాచలం 25 మిలియన్ల దిర్హామ్‌ ( రూ.60.42 కోట్లు)లు  గెలుచుకుని సంచలనం సృష్టించాడు.

New Update
FotoJet - 2025-11-04T070238.056

Indian wins Rs 60 crore in Abu Dhabi lottery

అప్పుడపుడు అదృష్టం అనుకోకుండానే వస్తోంది. యూఏఈ(UAE) లోని ఓ ప్రవాస భారతీయుడికి కూడా అలాగే అదృష్టం వరించింది. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లాటరీ అయిన ‘బిగ్‌ టికెట్‌ అబుధాబి 280’ సిరీస్‌లో ప్రవాస భారతీయుడు అయిన శరవణన్‌ వెంకటాచలం 25 మిలియన్ల దిర్హామ్‌లు  గెలుచుకుని సంచలనం సృష్టించాడు. ఇవి మన ఇండియన్‌ కరెన్సీ(Indian Currency) ప్రకారం రూ.60.42 కోట్లు. ‘బిగ్‌ టికెట్‌ అబుధాబి’(Abu Dhabi Lottery) పేరుతో తరచూ అబుధాబిలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. అబుధాబిలో నివసించే వెంకటాచలం గత అక్టోబర్‌ 30న ‘463221’ నంబరుతో ఉన్న టికెట్‌ను కొనుగోలు చేశారు. 

Also Read :  హెచ్-1బీ వీసాదారులకు శుభవార్త.. ప్రాసెసింగ్ రీస్టార్ట్

Indian Wins Rs 60 Crore In Abu Dhabi Lottery

దానికి సంబంధించి ఈనెల 3న డ్రా తీయగా అందులో వెంకటాచలం కొనుగోలు చేసిన టికెట్‌కు జాక్‌పాట్‌ తగలడం విశేషం. అయితే షో నిర్వాహకులు రిచార్డ్‌, బౌచ్రా శరవణన్‌ను ఫోన్‌లో సంప్రదించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయనకు పలుమార్లు ఫోన్‌ చేసినప్పటికీ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని నిర్వహకులు. అయితే ఈమెయిల్‌లోనూ ఆయనను సంప్రదిస్తామని నిర్వాహకులు చెప్పారు. గత సిరీస్‌ విజేత అయిన హరూన్‌ సర్దర్‌ నూర్‌ ఈ డ్రా తీసినట్లు తెలిపారు. 

Also Read :  టీమిండియా జట్టులో నో ప్లేస్.. కానీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్

Advertisment
తాజా కథనాలు