Nepal: నేపాల్‌లో చిక్కుకున్న భారత టూరిస్టు.. కర్రలతో వెంటబడ్డారని ఆవేదన, వీడియో

నేపాల్‌లో జెన్‌ Z చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. పొఖారా ప్రాంతంలోని ఓ హోటల్‌పై కూడా ఆందోళనకారులు దాడికి దిగారు. అయితే అందులో ఉన్న ఉపాసన గిల్ అనే భారత టూరిస్టు తనకు సాయం చేయాలంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

New Update
Indian tourist stranded in Nepal makes desperate appeal, Video Viral

Indian tourist stranded in Nepal makes desperate appeal, Video Viral

నేపాల్‌లో జెన్‌ Z చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ఆందోళనకారులు తగలబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొఖారా ప్రాంతంలోని ఓ హోటల్‌పై కూడా ఆందోళనకారులు దాడికి దిగారు. అయితే అందులో ఉన్న ఉపాసన గిల్ అనే భారత టూరిస్టు తనకు సాయం చేయాలంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. '' నాపేరు ఉపాసన గిల్. వాలీబాల్‌ లీగ్‌ కోసం నేపాల్‌కి వచ్చాను. ఇక్కడ నిరసనలు జరగడం వల్ల పోఖారాలోని హోటల్‌లో చిక్కుకున్నాను. 

Also Read: ప్రైవేట్ స్కూల్లో చదివించలేదని.. ముగ్గురు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..!

ముందుగా నేను బస చేసిన హోటల్‌కు ఆందోళనకారులు నిప్పంటించారు. నా వస్తువులు అందులోనే ఉన్నాయి. దాడి జరిగినప్పుడు నేను స్పాలో ఉన్నాను. కొంతమంది నిరసనకారులు పెద్ద కర్రలు వెంటబెట్టుకుని నా వెనకాలే దూసుకొచ్చారని'' గిల్‌ ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ల నుంచి తప్పించుకున్నానని.. తనకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం అక్కడ ఎక్కడా చూసినా రోడ్లపై మంటలే కనిపిస్తున్నాయని తెలిపింది. పర్యాటకులను కూడా వాళ్లు వదలిపెట్టడం లేదని.. అన్నింటిని తగలబెడుతున్నారని వాపోయింది.  

Also Read: నేపాల్‌ ప్రభుత్వాన్ని కూల్చిన 11 ఏళ్ల బాలిక.. అసలు కథ ఇదే !

ఇదిలాఉండగా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలకు దిగింది. ఖాట్మండ్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్‌లైన్‌ నంబర్లను విడుదల చేసింది. +977 – 980 860 2881  +977 – 981 032 6134 నెంబర్లకు సాధారణ కాల్స్‌తో పాటు, వాట్సాప్‌లో కూడా సంప్రదించవచ్చని సూచనలు చేసింది. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని.. వీధుల్లోకి రావొద్దని హెచ్చరించింది. స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలు పాటించాలని పేర్కొంది. 

Also read: నేపాల్ తర్వాతి ప్రధాని ఎవరు? జెన్ Z ఓటు ఆ ఇద్దరిలో ఎవరికి?

తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ చిక్కుకున్నారు. దీంతో ఢిల్లీలో తెలంగాణ భవన్‌, ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. +91 9818395787,+918500027678, ఇమెయిల్: [email protected], [email protected]ను సంప్రదించాలని సూచించారు. 

Also Read: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ..ఇండియా, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని కామెంట్

Advertisment
తాజా కథనాలు