ED Sheeran: దక్షిణాదిలోకి బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్..కోలీవుడ్ ఆల్బమ్ లో..

మోస్ట్ పాపులర్ బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్. ఇతనో ఫేమస్ పాప్ సింగర్. ఇప్పుడు దక్షిణాదిలోకి అడుగు పెడుతున్నారు. సంతోష్ నారాయణన్ తో కలిసి ఒక ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు. 

New Update
ED sheeran

ఎడ్వర్డ్ క్రిస్టోషర్ షరన్..అకా ఎడ్ షీరన్...ఇతని గురించి తెలియని వారెవరూ ఉండరు. ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ ఉన్న పాపం సింగర్ షీరన్. ఇప్పటికే ఇతను తన పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. ఎడ్ షీరన్ కేవలం ఇంగ్లీషు పాటలనే కాక ప్రపంచ సంగీతంతో ప్రయోగాలు చేస్తుంటాడు. ఇంతకు ముందు బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ తో కలిసి సాఫైర్ అనే ఒక ఆల్బమ్ ను రూపొందించాడు. అది చాలా పెద్ద హిట్ అయింది. అంతేకాదు ఇతను తన కన్సర్ట్ లలో తెలుగు పాటలు కూడా పాడుతుంటాడు. రీసెంట్ గా బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్ లో దేవరలోని చుట్టమల్లే సాంగ్ పాడాడు. దాని వీడియో సూపర్ వైరల్ కూడా అయింది. దీనికి ఎన్టీయార్ కూడా స్పందించారు. మీ గొంతులో ఆ పాట వినడం ఆనందంగా ఉంది అంటూ ఎడ్ షీరన్ కు ధన్యవాదాలు కూడా తెలిపారు. 

తమిళ్, ఇంగ్లీష్ కలిపి..

ఇప్పుడు తాజాగా ఎడ్ షీరన్ కోలీవుడ్ లో ఓ ఆల్బమ్ పాడబోతున్నారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణను రూపొందించే ఆల్బయ్ లో షీర్న్ తన గొంతు పలికించనున్నాడు. దీనికి సంబంధించి సంతోష్ నారాయణన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన కుమార్తే ధీ , కేరళకు చెందిన హనమాన్ కైండ్, డ్ షీరన్ లు తను రూపొందించబోయే మ్యూజిక్ ఆల్బమ్ లో భాగం కానున్నారని తెలిపారు ఇదొక అంతర్జాతీయ ఆల్బమ్ అని చెప్పారు. ఎడ్ షీరన్ తనతో భాస్వామ్యం అవుతున్నందుకు గర్వంగా ఉందంటూ సంతోష్ హర్షం వ్యక్తం చేశారు. 

Also Read: Space X: మస్క్ స్పెస్ ఎక్స్ రాకెట్ బూస్టర్ సూపర్ సక్సెస్..గల్ఫ్ ఆఫ్ మెక్సికో లో ల్యాండ్

Advertisment
తాజా కథనాలు