America: రష్యా చమురుతో భారత్ లాభాలు.. అమెరికా ట్రెజరీ కార్యదర్శి దాడి

అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ భారత్ పై పదే పదే దాడి చేస్తున్నారు.  రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్ లాభాలు గడిస్తోందని ఆరోపించారు. రష్యా చమురు ద్వారా ఇండియా 16 బిలియన్ల అదనపు లాభాలను ఆర్జించిందని చెబుతున్నారు.

New Update
america

US Treasury Secretary Scott Bessent

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అక్కడి అధికారుల వరకూ అందరూ విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే దీనిని కారణంగా చూపెట్టి ట్రంప్ 50 అదనపు శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దానికి తోడు ఇప్పడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి భారత్ పై ఆరోపణలతో దండెత్తారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఇండియా లాభాలు ఆర్జిస్తోందని ఆరోపించారు. చైనా చమురు వనరులను వైవిధ్యీకరించింది కానీ భారత్ మాత్రం అలాంటిదేమీ చేయకుండా లాభాలను ఎంజాయ్ చేస్తోందని అన్నారు. 

భారత్ విపరీతంగా లాభాలు..

రష్యా చమురు కొనుగోలు విషయంలో చైనా, భారత్ పట్ల వేర్వేరు వైఖరిపై స్కాట్ ను మీడియా ప్రశ్నించింది. దానికి సమాధానంగా ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుండి చైనా చమురు దిగుమతి కేవలం 3 శాతం మాత్రమే పెరిగిందని..కానీ భారతదేశం చమురు దిగుమతులు 40 శాతానికి పైగా పెరిగాయని చెప్పుకొచ్చారు.  పైగా చైనాపై అధిక సుంకాలు విధిస్తే ప్రపంచ ఇంధన ధరలు పెరుగుతాయని...అందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని సమర్థించారు. అయినా చైనా దుగమతి చేసుకుంటున్న చమురు చాలా తక్కవు.  2022 కు మందు రష్యా నుంచి చైనా 13 శాతం చమురు దిగుమతి చేసుకుంటే యుద్ధం మొదలైన తర్వాత దాన్ని కేవలం మూడు శాతం ఎక్కువ అంటే 16 శాతమే దిగుమతి చేసుకుంటోందని లెక్కలు చెప్పారు.  కానీ భారత్ మాత్రం దిగుమతులను చాలా ఎక్కువ చేసిందని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ అన్నారు. 

Also Read: Sensational Bill: 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని అయినా క్షమించేది లేదు.. లోక్ సభలో బిల్లు

రష్యా నుంచి చమురు తెచ్చుకుని భారత్ తిరిగి అమ్ముకుంటోంది. దీని ద్వారా 16 బిలియన్ల అదనపు లాభాలను ఆర్జించింది. యుద్ధ సమయంలో పుట్టుకొచ్చిన మధ్యవర్తిత్వంతో చౌకైన చమురును కొనుగోలు చేసి దానిని ఉత్పత్తిగా తిరిగి అమ్మడాన్ని అమెరికా ఎంత మాత్రం అంగీకరించదని..అందుకే అదనపు సుంకాలను విధించామని స్కాట్ తెలిపారు. అంతకుముందు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, చైనా రష్యన్ చమురును కొనుగోలు చేసి, శుద్ధి చేసి ప్రపంచ మార్కెట్‌లో విక్రయిస్తోందని.. చైనాపై ఏదైనా అదనపు సుంకం ప్రపంచ ఇంధన ధరలను పెంచే అవకాశం ఉందని అన్నారు. 

రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే..

ఇదెలా ఉంటే కావాలనే తాము భారత్ పై అదనపు సుంకాలను విధించామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కోరోలిన్ లీవిట్ అన్నారు. రష్యా ఒత్తిడి తెచ్చేందుకే తమ అధ్యక్షుడు ట్రంప్ ఈ అదనపు టారీఫ్ లను విధించారని మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని ఎా అయినా ముగించాలని ట్రంప్ అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలను లక్ష్యంగా చేసుకొని దానిపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నారని తెలిపారు. అది ట్రంప్‌ పరిపాలన వ్యూహమని లీవిట్ తెలిపారు. 

Also Read: Trump–Putin–Zelenskyy:బుడాపెస్ట్ లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ నేతల త్రైపాక్షిక సమావేశం? దానికంటే ముందు పుతిన్- జెలెన్ భేటీ?

Advertisment
తాజా కథనాలు