/rtv/media/media_files/2024/12/17/kmNzawQIiFcFWFSHjkqi.jpg)
భారత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచీ ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నేతలూ, మంత్రులూ జైలుకు వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. అయితే వారి శిక్షా కాలం పూర్తవగానే లేదా బెయిల్ మీద వచ్చినా..మళ్ళీ తమ పదవుల్లో కొనసాగారు. అయితే ఇక మీదట అలా చెల్లదు. ఎవరైనా పదవిలో ఉన్న నేత తీవ్ర నేరారోపణలతో జైలుకు వెళ్ళి వరుసగా 30 రోజులు ఉంటే వారి పదవి ఊడిపోతుంది. అది కేంద్ర మంత్రి అయినా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినా సరే..జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత తమ పదవికి రాజీనామా చేయాల్సిందే. అలా చేయకపోతే వారిని పదవి నుంచి తొలగిస్తారు. దీనికి సంబంధించిన చట్టాన్ని ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఈ బిల్లు కనుక అక్కడ ఆమోదం పొందితే...త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం ఐదేళ్ల శిక్ష పడేంత నేరానికి పాల్పడి...నెల రోజులు నిర్భందంలో ఉంటే..31వ రోజున వారి పదవి పోయే రూల్ ను ఈ బిల్లులో చేర్చారు. ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో ఇలాంటి నిబంధన లేదు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీలు అరెస్టైనా తమ పదవులకు రాజీనామా చేయలేదు.
మండిపడుతున్న కాంగ్రెస్..
అయితే ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందుతుందో లేదో తెలియదు. ఎందుకంటే దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాలు చెబుతోంది. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల ముఖ్యమంత్రులను తొలగించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
లోక్ సభలో మరో రెండు ముఖ్యమైన బిల్లులు...
ఈరోజు పార్లమెంటులో మొత్తం నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. వాటిల్లో ఒకటి పదవులకు సంబంధించింది కాగా ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ను మళ్ళీ రాష్ట్రంగా మార్చడం మరొకటి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, జమ్మూ కాశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. అయితే, శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఆన్ లైన్ గేమింగ్..
పై రెండూ తర్వాత ఆన్ లైన్ గేమింగ్ కు సంబంధించి కూడా మరో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆన్ లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య తేడా చూపించేలా ఈ బిల్లును రూపొందించారు. రూల్స్ ను ఉల్లంఘించి ఇక మీదట ఆన్ లైన్ గేమ్స్ అందిస్తున్నవారిపై చర్యలు తీసుకోనున్నారు. వీరికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. కోటి జరిమానా లేదా రెండూ విధించాలని ప్రతిపాదించనున్నారు. ఇక ఆన్ లైన్ గేమింగ్ అడ్వర్టైజ్ మెంట్స్ లో పాల్గొన్న వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
Also Read: Indo-China: భారత్, చైనా సంబంధాల్లో పురోగతి.. ప్రధాని మోదీ