Trump–Putin–Zelenskyy:బుడాపెస్ట్ లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ నేతల త్రైపాక్షిక సమావేశం? దానికంటే ముందు పుతిన్- జెలెన్ భేటీ?

రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ట్రంప్ చర్చలు ముగిశాయి. ఇక పుతిన్, జెలెన్ స్కీ కలవడమే ఉంది. జెలెన్ స్కీ తో సమావేశం తర్వాత రష్యా, ఉక్రెయిన్, అమెరికాల మధ్య త్రైపాక్షిక సమావేశం ఉంటుందని చెప్పారు. దానికన్నా ముందు ఫుతిన్, జెలెన్ స్కీ కలవనున్నారని తెలుస్తోంది. 

New Update
trump meeting

Trump, Zelensky, Putin

యుద్ధాన్ని ముగించడానికి సుముఖంగా ఉన్నామని రష్యా అధినేత పుతిన్, ఉక్రెయిన్ అధినేత జెలెన్ ఇద్దరూ చెప్పారు. నాలుగు రోజుల క్రితం అలస్కాలో పుతిన్ తో ట్రంప్ చర్చలు జరిపారు. ఈ బేటీలో గొప్ప పురోగతి సాధించామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. తర్వాత మూడు రోజులకు అంటే నిన్న వైట్ హౌస్ లో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, యూరోపియన్ అధినేతలతో సమావేశమయ్యారు. దీని తరువాత జెలెన్, ట్రంప్ ఇద్దరూ ఉత్పాహంగా కనిపించారు. యుద్ధ విరమణ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. జెలెన్ కూడా తాను శాంతి ఒప్పందానికి రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. దీని తర్వాత త్వరలోనే త్రై పాక్షిక సమావేశం ఉంటుందని ట్రంప్ ప్రకటించారు.

రష్యాలో పుతిన్, జెలెన్ స్కీ..

అయితే దాని కన్నా ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్ స్కీ కలవనున్నారని తెలుస్తోంది. రష్యా వన్ టూ వన్ సమావేశానికి ఆహ్వానం ఇవ్వాలని పుతిన్ చెప్పినట్లుగా తెలుస్తోంది.  నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు, యూరోపియన్ నేతలు వైట్ హౌస్ లో ఉండగానే ఈ పిలుపు వచ్చిందని చెబుతున్నారు. దీనికి వైట్ హౌస్ కూడా మద్దతు తెలిపిందని సమాచారం. వారిద్దరి ముఖాముఖి భేటీ కోసం ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ కూడా చెప్పారు. అయితే ఈ మీటింగ్ ఎక్కడ జరుగుతుందనేది మాత్రం ఆమె నిర్ధారించలేదు.  వారిద్దరి సమావేశం కోసం కొన్ని ప్రదేశాలను ఎంపిక చేశామని...త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయని చెప్పారు. దీనికి అమెరికా జాతీయ బృందాలు సహాయం చేస్తాయని లీవిట్ తెలిపారు. 

బుడాపెస్ట్ లో త్రై పాక్షిక సమావేశం..

పుతిన్, జెలెన్ స్కీ మీటింగ్ సంగతి అటుంచితే...తనతో పాటూ ఇరు దేశాధినేతల త్రై పాక్షిక సమావేశానికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మాటనే స్వయంగా నిన్న ఆయన అనౌన్స్ కూడా చేశారు. తాను త్రైపాక్షిక సమావేశాన్నే ప్రోత్సహిస్తానని ట్రంప్ అంటున్నారు. పుతిన్ కేవలం జెలెన్ స్కీ తో మీట్ అయితే చాలనుకుంటున్నారు కానీ...తనకి మాత్రం ముగ్గురు దేశాధ్యక్షులూ కలిస్తేనే మంచిదనిపిస్తోందిని ట్రంప్...ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో వినడం నిన్న హాట్ మైక్ లో అందరికీ వినిపించింది.  

దీనికి సంబంధించి వైట్ హౌస్ కూడా ఏర్పాట్లు చేయడం మొదలెట్టిందని అంటున్నారు. హంగేరీలోని బుడాపెస్ట్ లో త్రైపాక్షిక సమావేశం ఉండవచ్చని అంటున్నారు. ఈ ఊహాగానాలను వౌట్ హౌస్ సెక్కటరీ కరోలిన్ లీవిట్ అంగీకరించక పోయినప్పటికీ...ఖండించలేదు కూడా. మీట్ కు సంబంధించిన ప్రదేశం గురించి జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని.. త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని లీవిట్ చెప్పారు. 

బుడాపెస్ట్ ఎందుకు?

రష్యాకు సన్నిహిత దేశం బుడాపెస్ట్. పుతిన్ కు హంగేరియన్ ప్రధాని విక్టర్ ఓర్బన్ చాలా సన్నిహితులు. 2022లో హంగేరీ కూడా ఉక్రెయిన్ పై దాడులు చేసింది. అప్పటి నుంచి రష్యాతో స్నేహం మరింత పెరిగిందని చెబుతున్నారు.  అలస్కాలో రఫ్యా అధ్యక్షుడు పుతిన్ తో....ట్రంప్ భేటీ ముగిసిన దగ్గర నుంచి తర్వాతి సమావేశం రష్యాలో ఉండవచ్చని చెబుతూనే ఉన్నారు. అయితే రష్యాలో అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించకపోవచ్చనే వాదన కూడా ఉంది. అందుకే రెండు దేశాలు కాకుండా వాటికి దగ్గరలో ఉన్న హంగేరి అయితే బెస్ట్ అని అనుకుంటున్నారు. దీనికి ఆ దేశ ప్రధాని విక్టర్ కూడా అభ్యంతరం చెప్పరని భావిస్తున్నారు. అయితే ముందు పుతిన్, జెలెన్ స్కీ సమావేశం జరిగాకే..ట్రంప్ తో పాటూ జరిగే త్రై పాక్షిక సమావేశం ఉంటుందని అంటున్నారు. 

Also Read: Sensational Bill: 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని అయినా క్షమించేది లేదు.. లోక్ సభలో బిల్లు

Advertisment
తాజా కథనాలు