PM Modi: అమెరికాపై ఆధారపడొద్దు.. భారత్ నే బలంగా మార్చుకుందాం.. H1-B వీసాలపై మోదీ సంచలన రియాక్షన్!

ప్రధాని మోదీ H1-B వీసాలపై అమెరికా విధించిన లక్ష డాలర్ల రుసుముపై స్పందించారు. విదేశాలపై ఆధారపడడం అన్నింటి కన్నా పెద్ద శత్రువు అని అన్నారు. మనమంతా కలిసి ఆ శత్రువును జయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

New Update
Narendra Modi Trump

పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) లక్ష డాలర్ల రుసుము విధించిన విషయం తెలిసిందే.ఇందుకు సంబంధించిన ఫైళ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. రేపు అంటే.. సెప్టెంబర్ 21 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. దీంతో ఈ వీసాలను అత్యంధికంగా వినియోగించుకుంటున్న భారత టెకీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మైక్రోసాఫ్ట్(microsoft) లాంటి దిగ్గజ ఐటీ సంస్థలు ఈ వీసాలు కలిగిన ఇతర దేశాల ఉద్యోగులు వెంటనే అమెరికా వచ్చేయాలని ఆదేశించింది. మరో వైపు స్వదేశాలకు వెళ్తున్న వారు కూడా మార్గ మధ్యలోనే తమ జర్నీ క్యాన్సెల్ చేసుకుని తిరుగు ప్రయాణం ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఫ్లైట్ల ఛార్జీలు ఒక్క సారిగా విపరీతంగా పెరిగిపోయాయి.

Also Read :  అమెరికాలో H-1B వీసా ఫీజు పెంపుతో.. అష్టకష్టాలు పడనున్న భారతీయులు!

PM Modi Reaction Over H1 B Visa Fee Hike

ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ H1-B వీసా(h1-b-visa) లపై అమెరికా విధించిన లక్ష డాలర్ల రుసుముపై స్పందించారు. విదేశాలపై ఆధారపడడం అన్నింటి కన్నా పెద్ద శత్రువు అని అన్నారు. మనమంతా కలిసి ఆ శత్రువును జయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని గుర్తు చేశారు.  విదేశాలపై ఆధారపడితే మనం ఫెయిల్ అవుతామన్నారు. భారత్‌ను బలమైన ఆర్థిక వ్యవస్థలా మార్చాలన్నారు. ఆత్మాభిమానంతో బతుకుదామని భారతీయులకు పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది భవిష్యత్‌ను ఇతర దేశాల మీద వదిలేయబోమన్నారు. 

Also Read :  రూ. కోటి లాటరీ వస్తే... ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు