అమెరికాకు ఆ సేవలు బంద్.. భారత్ సంచలన నిర్ణయం

భారత్‌తో పాటు పలు దేశాలు ఇటీవల అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర తపాలాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

New Update
Postal Services

Postal Services

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌తో పాటు పలు దేశాలు అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర తపాలాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా కస్టమ్స్‌ విభాగం జారీ చేసిన కొత్త రూల్స్‌లో క్లారిటీ లేకపోవడం వల్ల అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేస్తున్నామని ఇండియా పోస్ట్ పేర్కొంది. 100 డాలర్ల వరకు విలువ ఉన్న బహుమతులు, లేఖలు, డాక్యుమెంట్ల సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఇటీవల భారత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సేవలు కూడా నిలిచిపోనున్నాయి.  

Also Read: తల్లిని చంపి ఆత్మహత్య చేసుకోమన్న చాట్ GPT.. 2 ప్రాణాలు బలి తీసుకున్న AI

ప్రస్తుత పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తున్నామని.. వీలైనంత త్వరగా ఈ సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటికే బుకింగ్ చేసిన పార్శిళ్లు చేరకపోవడంతో.. పోస్టల్ ఛార్జీలు కస్టమర్లకు తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. జులై 30న ట్రంప్ యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే ఆగస్టు 29 నుంచి 100 డాలర్లకు పైగా విలువైన పార్శిళ్లపై అమెరికా కస్టమ్స్ సుంకాలు అమల్లోకి వచ్చాయి.   

Also Read: ఏనుగు, డ్రాగన్ కలిసి అమెరికాపై దండయాత్ర.. SCO సమ్మిట్‌లో కీలక పరిణామం

అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం.. అమెరికా కస్టమ్స్, అంతర్జాతీయ పోస్టల్ నెట్‌వర్క్‌, సరిహద్దు రక్షణ (CBP) విభాగం ఆమోదించిన క్వాలిఫైడ్‌ పార్టీల ద్వారా వస్తువులను ఆయా సంస్థలు రవాణా చేస్తుంటాయి. ఈ సంస్థలే సుంకాలు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి విధానాన్ని పాటించాలనే దానిపై సరైన క్లారిటీ లేదు. దీంతో అమెరికాకు విమానాలు నడిపించే సంస్థలు తపాలా పార్శిళ్లు స్వీకరించలేదు. ఈ క్రమంలోనే పార్శిళ్ల బుకింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తపాలాశాఖ ప్రకటన చేసింది. ఈ కారణం వల్లే దాదాపు 25 దేశాలు సైతం అమెరికాకు తమ పోస్టల్ సర్వీసులు నిలిపివేశాయి. 

Also Read: విదేశీ విద్యార్థులపై ట్రంప్ భారీ బాంబు.. ఎఫ్ 1 వీసాపై ఇకపై అమెరికా వెళ్లడం కష్టమే!

#postal service #international #trump #rtv-news #telugu-news
Advertisment
తాజా కథనాలు