అమెరికాకు కెనడా మీదుగా అక్రమంగా వెళ్లేవారి భారతీయుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే మరోసారి దీనిపై భారత్ స్పందించింది. భారతీయులను కెనడా నుంచి అక్రమంగా తరలించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గతంలో కూడా అక్రమ రవాణాపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: అభ్యర్థులకు అలెర్ట్.. CUET PG రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఇలా అప్లై చేసుకోండి!
గ్లోబల్ అఫైర్స్ కెనడా విభాగం ప్రతినిధి మాట్లాడుతూ.. '' భారత్-కెనడా మధ్య బలమైన ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాలు వేరు వేరు విషయాలపై చర్చిస్తున్నాయి. విదేశాల్లో పౌరుల వలసులు, భద్రత, సంక్షేమం వంటి అంశాల గురించి చర్చలు జరుగుతున్నాయి. నేరాలను అరికట్టేందుకు భారత అధికారులతో కలిసి పనిచేసేందుకు కెనడా సిద్ధంగా ఉందని'' తెలిపారు.
Also Read: వణుకుతున్న ఉత్తరాది..విమానాలు, రైల్వే సర్వీసుల పై ఎఫెక్ట్!
ఇదిలాఉండగా.. 2022 జనవరిలో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు నుంచి అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించింది. ఆ సమయంలో తీవ్రమైన చలి వల్ల వాళ్లు మరణించారు. ఈ కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భవేష్ పటేల్‌తో సహా మరికొందరిపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. అంతేకాదు 2024 డిసెంబర్ చివరి వారంలో ముంబయి, గాంధీనగర్ సహా మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు చేసింది.
Also Read: ఉచిత బస్ ఎఫెక్ట్..అక్కడ 15 శాతం పెరిగిన ఛార్జీలు..మరి మన సంగతేంటో!
Also Read: ట్రెండింగ్లో ఓయో రూమ్స్.. దివాలా తీయడం ఖాయమట!