ఇండియా-కెనడా దౌత్యయుద్ధం | India-Canada Diplomatic War | India Canada Row | RTV
ఎన్ని చర్చలు చేసినా...ఎంత మంచిగా ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సర్కారు మాత్రం తన బుద్ధిని చూపించుకుంటూనే ఉన్నారు. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. తాజాగా భారత దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో ఉంచి...మన విదేశాంగ శాఖకు సమాచారం అందించారు.
ఇటీవల భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. కెనడా పౌరుల కోసం వీసా సేవలు పునరుద్దరిస్తున్నట్లు పేర్కొంది. ఎంట్రీ, బిజినెస్, మెడికల్ వీసాలు అలాగే కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్లు తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటిదాకా వీసా సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని.. వీటిపై సమీక్ష చేసిన అనంతరం ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నామని స్పష్టం చేసింది.