Delhi: చలితీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది.పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి మంచు దట్టంగా కురుస్తోంది.పొగమంచు కారణంగా విమాన,రైల్వే సేవలకు ఆటంకం కలిగింది. దీంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. Also Read: Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి భారత వాతావరణ విభాగం డేటా ప్రకారం..ఢిల్లీలో గత 24 గంటల్లో 16 డిగ్రీల గరిష్ఠ, 7.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించలేనంతగా పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు లో విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోయింది. Also Read: Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు! ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్.. జనవరి 8 వ తేదీ వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ మధ్య తేలికపాటి వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది. దీంతో ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సర్వీసులు రద్దు,ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఓసారి షెడ్యూల్ చూసుకొని బయల్దేరాలని విమానాయాన సంస్థలకు ప్రకటన విడుదల చేశాయి. Also Read: Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్ డెక్కర్ నే విద్యార్థులకు సెలవులు.. అటు యూపీ, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కన్పించింది.చలి గాలుల దృష్ట్యా నోయిడాలోని అన్ని స్కూళ్లలో 8 వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.బిహార్, పంజాబ్, రాజస్థాన్ , హరియాణాలోనూ దట్టంగా మంచు కురుస్తోంది. రాజస్థాన్ లోని ఫతేపూర్ లో గత 24 గంటల్లో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. Also Read: Team India Schedule 2025: వచ్చే ఏడాది టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!