India-EU: ఇండియా-ఈయూ వాణిజ్య ఒప్పందం.. పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఒప్పందాన్ని ఆయన 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌'గా అభివర్ణించారు.

New Update
Union Minister Piyush Goyal

Union Minister Piyush Goyal

భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఒప్పందాన్ని ఆయన 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌'గా అభివర్ణించారు. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విజయం లభించిందన్నారు. భారత వాణిజ్య చరిత్రలోనే ఇదొక మైలురాయన్నారు. '' ఈ ఒప్పందం వల్ల భారత్ నుంచి ఈయూ దేశాలకు వెళ్లే 99 శాతం ఎగుమతులకు సుంకాల రాయితీలు లభిస్తాయి. చాలా వస్తువులపై దిగుమతి సుంకం వెంటనే 0 శాతానికి తగ్గిపోతుంది. ఇది భారతీయ ఉత్పత్తులకు యూరప్ మార్కెట్‌లో గొప్ప పోటీని ఇస్తుంది.

Also Read: భారత్ దెబ్బ.. పాక్ అబ్బా.. UAE డీల్ క్యాన్సెల్.. అసలేం జరిగిందంటే?

వస్త్ర రంగంలో ఎగుమతులు 30- నుంచి 40 బిలియన్ డాలర్లకు పెరుగుతాయి. దీనివల్ల సుమారు 60 నుంచి 70 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిచ్చే రంగాలకు సూపర్ డీల్. ఇరుపక్షాలకు మేలు చేసేలా.. పరస్పర ప్రయోజనకరంగా ఈ ఒప్పందం కుదిరింది. మద్యం, ఆటోమొబైల్ విడిభాగాలపై భారత్ కొన్ని రాయితీలు ఇచ్చింది. రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను దెబ్బతీయకుండా, సున్నితమైన అంశాలను ఈ ఒప్పందం నుంచి మినహాయించాం. ఈ ఒప్పందానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను వేగవంతం చేస్తాం. 2026 క్యాలెండర్ ఏడాదిలోనే దీన్ని పూర్తిగా అమలులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని'' పియూష్ గోయల్ వెల్లడించారు.

Also Read:  ట్రైన్ లేట్.. విద్యార్థిని లైఫ్ సెట్: రూ. 9 లక్షల భారీ పరిహారం!

ఇదిలాఉండగా ఈ ఒప్పందం వల్ల యూరప్‌లో భారతీయ దుస్తులకు డిమాండ్ పెరగనుంది. రత్నాలు, ఆభరణాలు వంటివాటిపై సుంకాలు సున్నాకి చేరడం వల్ల ఈ రంగాలకు మరింత లాభం ఉంటుంది. ఇక ఫార్మా, కెమికల్స్‌ లాంటి వాటికి మెరుగైన మార్కెట్ యాక్సెస్ ఉంటుంది. అలాగే ఐటీ నిపుణుల రాకపోకలు కూడా మరింత సలుభతరం కానున్నాయి. వైద్య పరికరాలపై కూడా సుంకాల్ని ఎత్తివేసే ఛాన్స్ ఉంది. యంత్రాలు 44 శాతం, కెమికల్స్‌పై 22 శాతం ఉన్న దిగుమతి సుంకాలు సైతం తగ్గనున్నాయి. ఆలివ్ ఆయిల్, వెజిటెబుల్ ఆయిల్‌పై కూడా సుంకాలు ఎత్తివేయనున్నారు. 

Advertisment
తాజా కథనాలు