/rtv/media/media_files/2026/02/07/us-and-india-unveil-interim-trade-framework-2026-02-07-09-17-14.jpg)
US and India unveil interim trade framework
భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్యం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాలు ఓ సంయక్తంగా ప్రకటన చేశాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందం కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా భారత ఉత్పత్తులపై ఉన్న సుంకాన్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా తెలిపింది. తాజాగా జరిగిన మధ్యంతర ఒప్పందాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.
Also Read: గ్రామ సర్పంచ్ కీలక నిర్ణయం.. మద్యం లేకుండా పెళ్లి జరిపితే రూ.51 వేల నజరానా
భారతీయ ఎగుమతిదారులకు ఈ ఒప్పందం 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ తెరుస్తుందని అన్నారు. MSMEలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఎగుమతులు పెరగడం వల్ల దేశంలోని మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. దుస్తులు, పాదరక్షలు, ప్లాస్టిక్, తోలు, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, చేతివృత్తుల ఉత్పత్తులు లాంటి రంగాలకు లాభదాయంగా ఉంటుందని చెప్పారు.
Also Read: ఆ చర్చలు ఫెయిల్ అయితే ఇరాన్‌పై దాడులు చేస్తాం.. అమెరికా సంచలన వార్నింగ్
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత్ అంగీకరించినట్లు అమెరికా వెల్లడించింది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు ఒప్పుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు తమ దేశం నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించినట్లు తెలిపింది.
Follow Us