/rtv/media/media_files/2025/12/02/ravalpindi-2025-12-02-11-46-24.jpg)
పాకిస్తాన్(pakistan) అంతా అల్లకల్లోలంగా ఉంది. క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(imran-khan) మరణ వార్తలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు ఆయన కుటుంబసభ్యులను అనుమతించడం లేదు. దాంతో పాటూ ఆయన ఎలా ఉన్నారో కూడా చెప్పడం లేదు. కనీసం ఫోన్ కూడా మాట్లడనివ్వలేదు. ఆయన కోసం వెళ్ళిన ఆయన సోదరిమణులపై దాడి కూడా చేశారు అక్కడి పోలీసులు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతోంది. పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. కానీ ఇమ్రాన్ ఖాన్ ను మాత్రం చూపించడం లేదు.
Also Read : బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి సీరియస్.. మోదీ కీలక ప్రకటన!
దేశ వ్యాప్తంగా ఆందోళనలు..
ఇమ్రాన్ ఖాన్ ను బయటకు రానివ్వక పోవడంపై పాకిస్తాన్ మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అతని ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలుచేపట్టారు. భారీ ర్యాలీకి రంగం సిద్ధం చేశారు. రావల్పిండిలోనిఅడియాలా జైలు వెలుపల నిరసనలు ప్రకటించింది. ప్రతిపక్ష శాసనసభ్యులు అంతర్జాతీయ న్యాయస్థానం వెలుపల సమావేశమై, ఆపై అడియాలా జైలుకు కవాతు చేస్తారని పిటిఐ నాయకుడు అసద్ కైసర్ తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు అమలు చేయడం లేదని.. అలాగే జైలు నిబంధనలు కూడా పాటించడం లేదని ఆయన అన్నారు.
రావల్పిండిలో 144 సెక్షన్..
అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆందోళనలను అణిచేయాలని గట్టి పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రావల్పిండిలో 144 సెక్షన్ విధించింది. ఇవాళ, రేపు అన్ని బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని గ్రూపులు రావల్పిండిలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ తెలిపింది.
Also Read : H-1B Visa: దారుణంగా పడిపోయిన హెచ్-1 బీ వీసా పిటిషన్లు..పదేళ్ల కనిష్టానికి..
మానసికంగా హింసిస్తున్నారు..
అంతకు రెండు రోజుల ముందు తన తండ్రి గురించి ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు వారాలుగా ఆయనను తమకు చూపించలేదని..తన తండ్రిని డెత్ సెల్ లో ఉంచారని అన్నారు. ఆయన చనిపోయారంటూ వార్తలు రావడంతో తమకూ అనుమానంగా ఉందని భయాన్ని వ్యక్తం చేశారు. తమ తండ్రి విషయంలో ఏదో జరగకూడనిది జరిగినట్లు అనుమానం వ్యక్తంచేశారు. ఆయన సురక్షితంగా ఉన్నారా, లేదా? ఆరోగ్యంగా ఉన్నారా, మరణించారా అనే విషయాలు వెల్లడించకుండా జైలు అధికారులు తమను మానసికంగా హింసిస్తున్నారన్నారు. ఆయన బతికున్నట్లుగా తమకు ఆధారాలు చూపించాలని ఖాసీం ఖాన్ జైలు అధికారులను, పాక్ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రపంచ దేశాలకూ బహిరంగ విజ్ఞప్తి చేశారు. గత 845 రోజులుగా తన తండ్రి ఇమ్రాన్ ఖాన్(imran-khan)జైల్లోనే ఉన్నారని ఖాసీం ఖాన్ వివరించారు. అయితే గత నెల రోజుల నుంచి తనను, తన కుటుంబ సభ్యులను ఆయన్ను చూసేందుకు గానీ, మాట్లాడేందుకు గానీ అనుమతించడం లేదని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయనను తాము కలవవచ్చునని..కానీ జైలు అధికారులు మాత్రం దానికి ఒప్పుకోవడం లేదని ఖాసిం చెబుతున్నారు. కనీసం ఫోన్ కాల్స్ కూడా చెయ్యనివ్వడం లేదు. తమకు ఏ సమాచారం ఇవ్వకుండా పూర్తిగా అడ్డుకున్నారని ఖాసిం ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Follow Us