/rtv/media/media_files/2025/07/24/h1b-2025-07-24-10-36-56.jpg)
USA H1 B Visa
2025 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1 బీ వీసా దరఖాస్తులు దారుణంగా పడిపోయాయి. భారత టెక్ కంపెనీలు ఈసారి చాలా అంటే చాలా తక్కువ హెచ్ 1బీ పిటిషన్లను ఫైల్ చేశారు. 2015 తరువాత ఇంత తక్కువ వీసా దరఖాస్తులు ఫైల్ అవ్వడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దాదాపు 70 శాతం తగ్గుదల కనిపిస్తోందని చెబుతున్నారు. టాప్ టెన్ భారత టెక్ కంపెనీలు ఈ సారి కేవలం 4, 573 పిటిషన్లను మాత్రమే ఆమోదించాయి. ఇందులో ప్రతీ ఏడు అత్యంత ఎక్కువగా టెకీలను అమెరికా పంపించే టీసీఎస్ కూడా ఉంది.
ఏఐ అభివృద్ధి కోసం పెట్టుబడులు..
హెచ్ 1 బీ వీసాల విషయంలో చాలా మార్పులు జరిగాయి. అమెరికా విదేశీ ఉద్యోగులను నియమించుకోకూడదనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసా రూల్స్ ను మార్చేశారు. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు ఫీజులు లక్ష డాలర్లకు పెంచేశారు. దీంతో పాటూ అమెరికా కంపెనీలు ఏఐ మీద పెట్టుబడులు పెడుతూ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులకు అసలు వీసా పిటిషన్లను ఫైల్ చేయడం లేదు. దీంతో NFAP ప్రకారం.. H-1B పిటిషన్ల తిరస్కరణ రేటు (ప్రధానంగా ఉన్న ఉద్యోగులకు) 2025 ఆర్థిక సంవత్సరంలో 1.9%గా ఉంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 1.8% తిరస్కరణ రేటుకు దాదాపు సమానంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరం లో 2.4% రేటు కంటే తక్కువగా ఉంది. ఇందులో ఈ ఏడాది టీసీఎస్ 5, 293 హెచ్ 1బీ వీసా పిటిషన్లను వేస్తే అందులో కేవలం 846 మాత్రమే ఆమోదం పొందాయి. ఇది గతేడాదికంటే సగానికి పైగా తక్కువ. లాస్ట్ ఇయర్ 1, 452 వీసాలు ఆమోదం పొందాయి.
ఎక్కువగా అమెరికన్ కంపెనీలే..
2025 ఆర్థిక సంవత్సరంలో హెచ్ 1 బీ వీసా పిటిషన్లలో టాప్ 25 కంపెనీలలో కేవలం మూడే భారత టెక్ కంపెనీలు కనిపించాయని న్యూస్ వీక్ నివేదించింది. అమెరికా కంపెనీలు అన్నీ ఏఐ ను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెడుతున్నాయని అందుకే వారు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. కానీ ఇండియన్ టెక్ కంపెనీలు అలా చేయడం లేదని..అందుకే వాటి వీసాలు తిరస్కరణకు గురౌతున్నాయని న్యూస్ వీక్ రాసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో, NFAP విశ్లేషణ ప్రకారం.. అమెజాన్ నుండి అత్యధిక H-1B పిటిషన్లు 4,644 ఆమోదం పొందాయి. ఆ తర్వాత మెటాప్లాట్‌ఫారమ్‌లు (1,555), మైక్రోసాఫ్ట్ (1,394), గూగుల్ (1,050) ఉన్నాయి. ప్రారంభ H-1B ఆమోదాల కోసం మొదటి నాలుగు స్థానాలను US సంస్థలు ఆక్రమించడం ఇదే మొదటిసారి. అలాగే కాలిఫోర్నియా (21,559), టెక్సాస్ (12,613), న్యూయార్క్ (11,436), న్యూజెర్సీ (7,729), వర్జీనియా (7,579)లోని కంపెనీలు ఎక్కువగా వీసాలను పొందాయి.
Also Read: Cricket: రో-కో, గంభీర్ ల మధ్య దూరం..ఈ రోజు బీసీసీఐ సమావేశం
Follow Us