/rtv/media/media_files/2026/01/06/hindu-man-killed-in-bangladesh-2026-01-06-10-32-14.jpg)
Hindu Man Killed In Bangladesh, 2nd Such Incident In 24 Hours
బంగ్లాదేశ్(bangladesh) లో రోజురోజుకు హిందువు(hindus) లపై దాడులు, హత్యలు పెరగడం కలకలం రేపుతోంది. మణి చక్రవర్తి అనే కిరాణా దుకాణం నడుపుతున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండుగులు ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. ఇంతకుముందు రాణాప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టును హత్య చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అంటే గడిచిన 24 గంటల్లో ఇద్దరు హిందువులు హత్యకు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే నర్సింగ్డి జిల్లాలో చార్‌సిందూర్ బజార్‌లో మణి చక్రవర్తి ఓ కిరాణా షాపును నడుపుతున్నాడు.
Also Read: వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం దగ్గర కాల్పులు
Hindu Man Killed In Bangladesh
సోమవారం రాత్రి కొందరు దుండగులు షాపులోకి చొరబడి ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన మణి చక్రివర్తిని అక్కడున్న స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడు చాలా మంచి వ్యాపారి అని, ఎవరితో కూడా విభేదాలు లేవని తోటి వ్యాపారులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి దాడుల జరగడంతో తాము కూడా భయాందోళనలో ఉంటున్నామని వాపోతున్నారు. ఈ ఘటనకు పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఇండియన్ ఆర్మీలో లక్ష మందితో భైరవ్ దళం.. ఇక యుద్ధంలో డ్రోన్లతో చెడుగుడే!
ఇదిలాఉండగా ఇటీవల బంగ్లాదేశ్ ఉద్యమకారుడు ఉస్మాన్ హదీ హత్య తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటినుంచి అక్కడ హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 18 రోజుల్లోనే ఆరుగురు హిందువులను హత్య చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో అక్కడ హిందువులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Follow Us