Helicopter: గాల్లో తిరుగుతూ కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ హెలికాప్టర్‌ గాల్లో గిరగిరా తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హంటింగ్టన్ అనే బీచ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Helicopter Spins In Air, Crashes Into Trees At California Beach, 5 Injured

Helicopter Spins In Air, Crashes Into Trees At California Beach, 5 Injured

అమెరికా(america) లోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ హెలికాప్టర్‌ గాల్లో గిరగిరా తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది(helicaptor-crash). హంటింగ్టన్ అనే బీచ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ఆ హెలికాప్టర్‌ సాధారణంగానే ప్రయాణించింది. కానీ ఒక్కసారిగా కంట్రోల్ తప్పిపోయి గాల్లో తిరిగింది. క్షణాల్లోనే కింద ఉన్న చెట్లపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరికి, నేలపై ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వాళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హెలికాప్టర్‌ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read :  మహిళా జర్నలిస్టులను ఆహ్వానించిన అఫ్గాన్‌ మంత్రి..

Helicopter Spins In Air - Crashes Into Trees

Also Read :  భారత పరిశ్రమలు బంగ్లాదేశ్‌కు వస్తాయి.. యూనస్‌ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు