Saudi Arabia: సౌదీకి వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్.. రూల్స్‌ మరింత కఠినం

ఇకనుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి చేదు వార్త అందింది. భారతీయ కార్మికులను సంఖ్యను నియంత్రించే దిశగా అక్కడి ప్రభుత్వం కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Saudi Arabia

Saudi Arabia

మనదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఇకనుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి చేదు వార్త అందింది. భారతీయ కార్మికులను సంఖ్యను నియంత్రించే దిశగా అక్కడి ప్రభుత్వం కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై సౌదీ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు కచ్చితంగా వృత్తిపరమైన, విద్యా అర్హతలకు సంబంధించి ముందస్తు వెరిఫికేషన్ తప్పకుండా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్‌ మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.    

Also Read: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం..

 సౌదీలోని భారత దౌత్య కార్యాలయం ఈ విషయాలను వెల్లడించింది. వర్క్‌ వీసాల జారీకీ ఉన్న నిబంధనల్లో తాజాగా ప్రొఫెషనల్ వెరిఫికేషన్ కూడా చేర్చారని పేర్కొంది. అలాగే ఎగ్జిట్‌, రీఎంట్రీ వీసా పొడిగింపు, రెసిడెన్సీ పర్మిట్ నిబంధనలను సైతం సౌదీ సవరించింది. అయితే ఈ ముందస్తు వెరిఫికేషన్‌ను తప్పనిరి చేసే అంశాన్ని 6 నెలల క్రితమే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ భారత్‌ నుంచి వచ్చే కార్మికులను నియంత్రణలోకి తెచ్చేందుకే అక్కడి ప్రభుత్వం ఈ కొత్త రూల్ తీసుకొచ్చినట్లు సమాచారం. 

కొత్త రూల్స్ ప్రకారం చూసుకుంటే.. వర్క్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లు తమ విద్యార్హతలను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవాస ఉద్యోగులు ఇచ్చే సర్టిఫికేట్లు, ప్రొఫెషనల్ సమాచారాన్ని సంబంధిత సంస్థల యాజమాన్యాలు, అలాగే హెచ్‌ఆర్‌ విభాగాలు కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. 

Also Read: నీ గూగుల్ సెర్చ్‌కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!

ఇదిలాఉండగా 2024 నాటికి సౌదీ అరేబియాలో 4 లక్షల మందికి పైగా భారతీయ కార్మికులు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారు. వీళ్లలో 16.4 లక్షల మంది ప్రైవేటు రంగ సంస్థల్లో ఉన్నారు. 7.8 లక్షల మంది ఇళ్లల్లో పనులు చేస్తున్నారు. అయితే సౌదీలో ప్రవాస ఉద్యోగులు చేసేవారిలో బంగ్లాదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశం నుంచి అక్కడ 26.9 లక్షల మంది పనిచేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు