/rtv/media/media_files/2025/01/14/OOTJOoodXNCKJ4gcIw9z.jpg)
Los Angeles Wildfires
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు ఇంకా చల్లారడం లేదు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఆర్పడం సవాలుగా మారుతోంది. అయితే సోమవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంలో గాలులు వీసినట్లు అధికారులు తెలిపారు. ఇక మంగళవారం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
గాలి వేగం గంటకు 72 కిలోమీటర్లకు చేరుకుంటే మంటలను అదుపు చేయడం చాలా కష్టమని లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంథోని మర్రోన్ తెలిపారు. కార్చిచ్చుకు సమీపంలో నివసించేవారు ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తే వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోవాలని సూచనలు చేశారు. అధికారిక తరలింపు ఉత్తర్వుల కోసం వేచి ఉండకూడదని పిలుపునిచ్చారు. రానున్న రెండు రోజులు మరింత కీలకమన్నారు.
Also Read: మిషన్ మౌసంను ప్రారంభించిన ప్రధాని మోదీ..
ఇదిలాఉండగా లాస్ ఏంజిల్స్‌లో ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటివరకు 24 మందికి పైగా మృతి చెందారు. మరో రెండు డజన్ల మంది ఆచూకి లేకుండా పోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. మంటలను అదుపుచేయడంలో బైడెన్ ప్రభుత్వ విఫలమైందన్నారు. ఈ మంటలను బైడెన్ తనకోసమే వదిలేశారంటూ విమర్శించారు.
కార్చిచ్చు ప్రమాదం వల్ల పాలిసాడ్స్ ఫైర్‌లో 23,707 ఎకరాలు, ఏటోన్ ఫైర్‌లో 14,117 ఎకరాలు దగ్ధమైంది. ఇక కెన్నెత్‌లో 1,052 ఎకరాలు, హుర్సెట్‌లో 779 ఎకరాలు దగ్ధమయ్యాయి. అలాగే 12 వేలకు పైగా నిర్మాణాలు కాలిపోయాయి. 60 చదరపు కిలోమీటర్ల ప్రాంతం బుడిదగా మారింది. అత్యధికంగా ఏటోన్ ఫైర్‌లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలిసాడ్స్‌లో 8 మంది మృతి చెందారు.
మొత్తం ఆరుచోట్ల కార్చిచ్చు వ్యాపించగా పాలసాడ్స్, ఏటోన్ ప్రాంతాంల్లో ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పలువురి హాలివుడ్ సార్ల ఇళ్లు కూడా కాలిపోయాయి. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇంటిని కూడా అధికారులు ఖాళీ చేయించారు. జో బైడెన్ కూడా ఈ ప్రమాదం కారణంలో తన చివరి ఇటలీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక ఈ కార్చిచ్చు వల్ల లాస్ ఏంజిల్స్‌లో రూ.13 లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది.
Also Read: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం..
ఇక మంటలు అదుపుచేసేందుకు ఫోస్ చెక్ అనే మిశ్రమాన్ని 9 విమానాలు, 20 హెలికాప్టర్ల సాయంతో లాస్‌ఏంజెల్స్‌పై వెదజల్లుతున్నారు. ఇది అక్కడి నిర్మాణాలు, మొక్కలపైనా పడి మంటలను కంట్రోల్ చేస్తుందని సిబ్బంది చెబుతున్నారు.
ఇందులో అమ్మోనియం పాలీపాస్ఫేట్ చెట్లపై పడి.. అగ్నికి ఆక్సిజన్ అందకుండా చేస్తుండడంతో మంటలు నెమ్మదిస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రైవేట్ ఫైర్‌ఫైటర్ గంటకు 2,000 డాలర్లు అంటే రూ.1,73,000 ఛార్జ్ చేస్తున్నారు. ఆస్తులను రక్షించుకునేందుకు బిలియనీర్స్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.