/rtv/media/media_files/2025/04/25/VCAUhzTO1KayXBuYraJW.jpg)
vidadala rajini acb
మాజీ మంత్రి విడదల రజనికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను సూచించింది. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని, విచారణకు సహకరించాలని విడదల రజనికి సూచించింది. ఇక రజనీ పీఏ రామకృష్ణకు 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు తెలిపింది. కాగా లక్ష్మీ బాలాజీ స్టోన్స్ క్రషర్స్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా రజిని ఉన్నారు. ఈ కేసులో ఏ3గా ఉన్న ఆమె మరిది గోపీనాథ్‌ను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది.
Also Read : National Herald case: ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!
Also Read : టీచర్ కాదు టార్చర్.. హోం వర్క్ చేయలేదని విద్యార్థినితో దారుణం.. లేడీ టీచర్‌కు రూ.2 లక్షల జరిమానా!
మార్చిలో కేసు నమోదు
కాగా.. విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.
Also Read : TG Crime: నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
Also read : Cheap Liquor: నాశనం అయిపోతార్రా.. మరీ ఇంత మోసమా.. ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్!
andhra-pradesh | Vidadala Rajini | acb case on vidadala rajini