/rtv/media/media_files/2025/11/21/h-1b-visa-crackdown-triggers-us-banks-hiring-boom-in-india-2025-11-21-16-16-48.jpg)
H-1B visa crackdown triggers US banks hiring boom in India
చాలామంది అమెరికాకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేయాలనుకుంటారు. మరికొందరు అక్కడే స్థిరపడాలనుకుంటారు. ఏటా వేలాది మంది భారత్ నుంచి అమెరికాకు పై చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇటీవల అక్కడి ప్రభుత్వం హెచ్1బీ వీసా ధరలను1 లక్ష డాలర్లకు (రూ.88 లక్షలు) పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో కొత్తగా అమెరికా వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. అక్కడి కంపెనీలు కూడా విదేశీయులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు భారత్‌లోనే తమ కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్నాయి.
భారత్ వైపు మొగ్గు
ముఖ్యంగా అమెరికన్ బ్యాంకులు భారత్‌లో తమ కార్యకలాపాలను అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (GCC)లను విస్తరించనున్నట్లు తెలుస్తోంది. జేపీమోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ శాక్స్ లాంటి బ్యాంకులు అలాగే కేకేఆర్, మిలీనియమ్ మేనేజ్‌మెంట్ వంటి పెట్టుబడి సంస్థలు ఇప్పటికే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ట్రంప్ హెచ్1 బీ వీసా రూల్స్‌ను కఠినంతరం చేయడంతో ఈ అమెరికన్ బ్యాంకులు భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటున్నాయి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్.. ఈ మూడు నగరాల్లో ఫైనాన్స్ స్పెషలిస్టు ఉద్యోగాల నియామకాలను మరింత పెంచుతున్నట్లు తెలుస్తోంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం జేపీమోర్గాన్ చేజ్.. బెంగళూరులో క్రెడిట్ సపోర్ట్ స్పెషలిస్టు ఉద్యోగాల నియామకాలు చేపట్టింది. గోల్ట్‌మాన్ శాక్స్ గ్రూప్.. లోన్ సమీక్షల కోసం అసోసియేట్లను కోరుతోంది. ఇక ముంబైలో కేకేఆర్ అండ్ కో.. పోర్ట్‌ఫొలియో కంపెనీలను పర్యవేక్షించేందుకు తమ బృందాలను మరింత విస్తరిస్తోంది. మిలీనియమ్ మేనేజ్‌మెంట్ సంస్థ డెరివేటింగ్ ట్రేడింగ్ టీమ్ కోసం రిస్కీ విశ్లేషకుల కోసం చూస్తోంది. హెచ్ 1 బీ రూల్స్ మారిన తర్వాత ఇలా అమెరికన్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు.. భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
75 శాతం భారతీయులే
ఇక్కడ మరో విషయం ఏంటంటే హెచ్1 బీ వీసా పొందే వాళ్లలో దాదాపు 75 శాతం భారత్‌కు చెందిన నిపుణులే ఉండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అమెరికన్ కంపెనీలు భారతీయ నైపుణ్యాలపై ఎంతగా ఆధారపడుతున్నాయే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల హెచ్1 బీ వీసా ధరలు లక్ష డాలర్లకు పెరగడం, ఆటోమెటిక్ EAD ఎక్స్‌టెన్షన్‌ను తొలగించడం వల్ల అమెరికన్ కంపెనీలు తమ ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విదేశీ హెచ్1 బీ వీసాదారులను నియమించుకునేందుకు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నాయి.
Also Read: అమెరికాకు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్.. ఇకనైనా ట్రంప్ దిగొస్తాడా?
ఇప్పటికీ కూడా అమెరికన్ కంపెనీలు తమ దేశంలోని ఉద్యోగులను నియమించుకునేందుకు మొగ్గు చూపడం లేదు. దీనికి బదులుగా తమ ఉద్యోగాలను ఇతర దేశాలకు తరలిస్తున్నాయి. హైచ్‌బీ వీసా ధరలు పెరగడంతో అమెరికన్ కంపెనీలు L1 వీసా రూట్‌ను ఎంచుకుంటున్నాయి. L1 నామ్ ఇమిగ్రేషన్ వీసా అనేది అమెరికన్ కంపెనీలు తమ ఉద్యోగులను విదేశాల నుంచి అమెరికాకు తాత్కాలికంగా బదిలీచేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది విదేశాల్లో ఉండి అమెరికన్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.
Follow Us