/rtv/media/media_files/2025/12/10/h-1b-visa-appointments-2025-12-10-10-01-25.jpg)
H-1B Visa Appointments Postponed For Many Indians Amid US' Social Media Rules
అమెరికాకు వెళ్లాలనుకునేవారికి మరో షాక్ తగిలింది. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ హెచ్1బీ దరఖాస్తుదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఈ పాలసీని తీసుకురాడవం వల్ల వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం దీనికి సంబంధించి ప్రకటన చేసింది.
ATTENTION VISA APPLICANTS - If you have received an email advising that your visa appointment has been rescheduled, Mission India looks forward to assisting you on your new appointment date. Arriving on your previously scheduled appointment date will result in your being denied…
— U.S. Embassy India (@USAndIndia) December 9, 2025
ఈ ఏడాది డిసెంబర్ మధ్యలో వీసాదారుల ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా.. ఇవి వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది వీసాదారులకు వచ్చే ఏడాదికి వాయిదా పడింది అనేది క్లారిటీ లేదు. ఇదిలాఉండగా ఇటీవల ట్రంప్ యంత్రాంగం H1బీ వీసా దరఖాస్తులతో పాటు H4 వీసాల పరిశీలనను, వెట్టింగ్ చర్యలను మరింత విస్తరించిన సంగతి తెలిసిందే.
Also Read: పుతిన్ రెడీ..జెలెన్ స్కీయే ఒప్పుకోవడం లేదు..ట్రంప్ ప్రకటన
దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్ అకౌంట్‌లోకి మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే డిసెంబర్ 15 నుంచి అధికారులు వాటిని పరిశీలిస్తారు. వారి సోషల్ మీడియాలో అమెరికా ప్రజల భద్రతకు ఏమైన ముప్పు పొంచి ఉన్నట్లు తేలితే వారికి H1బీ వీసాను మంజూరు చేయడం రద్దు చేస్తారు. విద్యార్థులు, ఎక్చేంజ్ విజిటర్లకు కూడా ఈ రూల్ వర్తించనుంది. ఇదిలాఉండగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ట్రంప్ హెచ్1బీ వీసా ధరలను ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా అమెరికా వెళ్లేవారికి ఈ ఫీజులు భారంగా మారనున్నాయి.
ఇటీవల వాషింగ్టన్‌లో ఇద్దరు నేషనల్ గార్డులపై అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అమెరికా 19 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించింది. ఆ దేశాలకు గ్రీన్‌కార్డు, అమెరికా పౌరసత్వం, ఇతర ఇమిగ్రేషన్ విధానాలను నిలిపివేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 85 వేల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ట్రంప్ యంత్రాంగం ప్రకటన చేసింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
Follow Us