H1B Visa: హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు మరో బిగ్ షాక్

హెచ్‌1బీ, హెచ్‌4 వీసా దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది దరఖాస్తుదారులకు సంబంధించిన వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాది అక్టోబర్‌ వరకు వాయిదా పడినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  

author-image
By B Aravind
New Update
H1b Visa

H1b Visa

ట్రంప్ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత అమెరికా వెళ్లడం కష్టతరంగా మారిపోయింది. ఇటీవల కొత్తగా సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హెచ్‌1బీ, హెచ్‌4 వీసా దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరికి వీసా వస్తుందో ? ఎవరికి రాదో అనే ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు ఈ వీసా కోసం దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబర్‌ దాకా వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది దరఖాస్తుదారులకు సంబంధించిన వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాది అక్టోబర్‌ వరకు వాయిదా పడినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  

Also read: మాహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు.. జి రామ్‌ జి బిల్లులో కీలక మార్పులు ఇవే !

ఇక వివరాల్లోకి వెళ్తే.. వాస్తవానికి హెచ్‌1బీ, హెచ్‌4 వీసా ఇంటర్వ్యూలో ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది జనవరి మధ్య జరగాల్సి ఉంది. కానీ వెట్టింగ్‌ పాలసీ వల్ల ఈ ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చికి రీషెడ్యూల్ చేశారు. ఈ విషయాన్ని ఇటీవలే అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. కానీ ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.  వీళ్ల ఇంటర్వ్యూ తేదీలను ఏకంగా అక్టోబర్‌కు వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్లను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు సమయం ఎక్కువగా పడుతోందని.. అందుకే ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు అంటున్నారు.    

Also Read: భారతీయులుగా ఉండలేం.. విదేశాలే ముద్దంట్టున్న ఇండియన్స్

మొత్తానికి హెచ్‌1బీ, హెచ్‌4 వీసా దరఖాస్తుదాలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే అమెరికాలో జాబ్ తెచ్చుకొని ప్రయాణాల కోసం టికెట్లు బుక్‌ చేసుకున్నవారు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇదిలాఉండగా సోషల్ మీడియా వెట్టింగ్‌ను డిసెంబర్ 15 నుంచి ప్రారభించిన సంగతి తెలిసిందే. హెచ్‌1బీ, హెచ్ 4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియాను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇప్పటికే దరఖాస్తుదారను తమ ఖాతాలను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తమ జాతీయ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికా స్పష్టం చేసింది.  

Advertisment
తాజా కథనాలు