/rtv/media/media_files/2025/12/18/vb-g-ram-g-bill-2025-12-18-15-31-20.jpg)
Lok Sabha passes VB–G Ram G Bill that seeks to replace MGNREGA amid Opposition uproar
మాహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్కీమ్‌ను కేంద్రం రద్దు చేసింది. దాని స్థానంలో 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్' (వీబీ జీ రామ్ జీ) పేరుతో కొత్త బిల్లుకు లోక్‌సభలో గురువారం ఆమోదం తెలిపింది. ముందుగా ఈ బిల్లుపై చర్చ జరగగా విపక్షాలు నిరసనలు చేశాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలోనే స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా కొత్త బిల్లుకు ఆమోదం లభించింది. కొందరువిపక్ష నేతలైతే వీబీ జీ రామ్ జీ బిల్లు కాపీలను చించేశారు. ఆ తర్వాత లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
Also Read: భారతీయులుగా ఉండలేం.. విదేశాలే ముద్దంట్టున్న ఇండియన్స్
మహాత్మ గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే
వీబీ జీ రామ్ జీ బిల్లుపై విపక్షాలు చేసిన ఆరోపణలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. మహాత్మగాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఎన్డీయే ప్రభుత్వం సంక్షేమ కార్యకలాపాలు చేపడుతోందని అన్నారు. బాపు సిద్ధాంతాలను కాంగ్రెస్ ప్రభుత్వమే చంపేసిందని విమర్శించారు. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి స్కీమ్‌లతో గాంధీజి కలలను తమ ప్రభుత్వమే సాకారం చేస్తోందని స్పష్టం చేశారు. అంతేకాదు ముందుగా ఈ ఉపాధి హామీ పథకానికి NGREGA పేరే ఉండేదన్నారు.
2009లో లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకు ఈ స్కీమ్‌కు మహాత్మగాంధీ పేరు చేర్చిందని అన్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా కూలీలపై ఎక్కువగా ఖర్చు చేసి మెటీరియల్ కొనుగోలుకు తక్కువగా వెచ్చించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పేరు మార్పుపై ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలను కూడా శివరాజ్ సింగ్ తిప్పికొట్టారు. గతంలో చాలా పథకాలకు కాంగ్రెస్ గాంధీ-నెహ్రూ పేర్లు పెట్టి మార్చేసిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదలకు ఉపాధి కల్పించడం కోసం 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం NGREGA పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2009లో దీన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీయే సర్కార్ ఈ స్కీమ్‌ను రద్దు చేస్తూ దాని స్థానంలో 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్' (వీబీ జీ రామ్ జీ) పేరుతో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది.
Also Read: నెహ్రూకు ఎవరికి లెటర్స్ రాశారో తెలుసా.. వాటిలో ఏంముందో తెలిస్తే షాక్!
జీ రామ్ జీ పథకంలో 5 కీలక మార్పులు
1.గతంలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకానికి 100 రోజుల పని ఉండేది. కానీ జీ రామ్ జీ స్కీమ్‌లో మాత్రం గ్రామీణ కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా అందించేందుకు పనిదినాలను 125 రోజులకు పెంచారు. దీనివల్ల కూలీలకు అదనంగా 25 రోజులు ఎక్కువగా ఉపాధి హామీ లభిస్తుంది.
2. ఈ కొత్త స్కీమ్ ప్రకారం వ్యవసాయ సీజన్‌లో విరామం ఉంటుంది. ముఖ్యంగా విత్తు వేసే సమయంలో, కోత సమయంలో కూలీల కొరత ఏర్పడుకుండా ఉండేందుకు ఈ విరామం ఇచ్చారు. అంటే ఏడాదిలో 60 రోజుల పాటు ఈ ఉపాధి పనులు నిలిపివేస్తారు. ఈ 60 రోజుల మినహాయించి మిగిలిన 305 రోజుల్లో 125 రోజులు పని ఉంటుంది.
3. మహాత్మగాంధీ స్కీమ్‌లో కూలీల వేతనాలను కేంద్రమే పూర్తిగా భరించేది. కొత్త బిల్లు ప్రకారం కేంద్రం 60 శాతం, 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలకు 90 శాతం కేంద్రం,10 శాతం రాష్ట్రాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఆర్థిక భారం పెరగనుంది.
4. గతంలో కూలీల హాజరును పేపర్ పైనే జరిగేది. దీనివల్ల కూలీలు పనికి రాకున్న పనికి వచ్చినట్లు హాజరు వేయించుకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకే కొత్త స్కీమ్‌లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేశారు. జియో ట్యాగింగ్, ఏఐ వంటి సాంకేతికతలను వినియోగించనున్నారు. పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక 'నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్'ను ఏర్పాటు చేయనున్నారు.
5. జి రామ్ జి స్కీమ్ ప్రధానంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు.
1.నీటి భద్రత (చెరువుల పునరుద్ధరణ వంటివి)
2. గ్రామీణ మౌలిక సదుపాయాలు (రోడ్లు, కనెక్టివిటీ)
3. జీవనోపాధి వనరులు (స్టోరేజ్ హౌస్‌లు, మార్కెట్లు)
4. విపత్తు నిరోధక పనులు
Follow Us