Niagara Water Falls: మంచు దుప్పటి కప్పుకున్న నయాగారా జలపాతం.. ఇలా ఎందుకు మారిపోయిందో తెలుసా ?

నయాగారా జలపాతం అంటే ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2026 జనవరి నుంచి తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా అక్కడ అంతా మంచుమయంగా మారిపోయింది. అయినప్పటికీ పర్యాటకులు చలిని పట్టించుకోకుండా ఈ ప్రదేశానికి వస్తున్నారు.

New Update
Why has Niagara Water Falls frozen ? Breathtaking ice cliffs take over

Why has Niagara Falls frozen ? Breathtaking ice cliffs take over

నయాగారా జలపాతం అంటే ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్ అమెరికాలో ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రపంచదేశాల నుంచి అనేక మంది టూరిస్టులు వస్తుంటారు. ప్రతిరోజూ అక్కడ పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు ఆ ప్రదేశం మంచుదుప్పటిని కప్పుకుంది. 2026 జనవరి నుంచి తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా అక్కడ అంతా మంచుమయంగా మారిపోయింది. అయినప్పటికీ పర్యాటకులు చలిని పట్టించుకోకుండా ఈ ప్రదేశానికి వస్తున్నారు. 

Also Read: మీరు నవ్వడం ఎప్పుడూ చూడలేదు.. మీరొక చెత్త రిపోర్టర్..  జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం..

 అక్కడ గడ్డకట్టిన జలపాతాలు, మంచులో కూరుకుపోయిన వృక్షాలు, పొగమంచును చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలపాతంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇది పూర్తిగా గట్టకట్టలేదు. కానీ అంచులు, వంతెనలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం భారీగా మంచు పెరుకుపోయింది. దీంతో మంచుతో నిండిన ఈ మనోహర దృశ్యాన్ని చూసేందుకు కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. 

నయగరా జలపాతం గట్టకట్టడానికి కారణాలు

ఆర్కిటిక్ ప్రాంతం నుంచి బలమైన శీతల గాలులు వీస్తుండంటంతో నయాగరా జలపాతం పాక్షికంగా గట్టకట్టింది. ఉత్తర ధ్రువం వద్ద శీతల గాలిని బంధించి ఉంచే పోలార్‌ వోర్టెక్స్‌ వ్యవస్థలో అస్థిరత రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 2026 జనవరిలో వచ్చిన స్ట్రాటోస్పిరిక్ వార్మింగ్ వల్ల ఈ సుడిగుండం బలహీనపడింది. అలాగే ఉత్తర అమెరికా వైపు తీవ్రమైన చలి గాలులు వీచాయి. దీంతో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కన్నా దిగువకు పడిపోయింది. భారీ మంచు తుఫానుల వల్ల కూడా ఆ ప్రాంతమంతా మంచుగా మారిపోయింది. జలపాతాల నుంచి వచ్చే తుంపరలు కూడా ఈ చలికి గట్టకట్టి మంచుపొరలుగా ఏర్పడ్డాయి. ఈ శీతల ప్రభావం నార్త్‌ అమెరికాకే కాకుండా యూరప్, ఆసియా దేశాల్లో కూడా ఉంది. 

Also Read: ఆశ్రమంలో అశ్లీల చిత్రాలు.. నలుగురు సన్యాసుల అరెస్ట్

Advertisment
తాజా కథనాలు