Melinda Gates : అందుకే బిల్ గేట్స్ కు విడాకులిచ్చా.. మెలిండా సంచలన విషయాలు!

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్‌ గేట్స్ గురించి తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే ఒక నేరగాడికి సంబంధించిన పాత ఉత్తరాలు, ఈమెయిల్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

New Update
bill gates

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్‌ గేట్స్ గురించి తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్(Epstein Files) అనే ఒక నేరగాడికి సంబంధించిన పాత ఉత్తరాలు, ఈమెయిల్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇందులో బిల్‌ గేట్స్ పేరు కూడా ఉండటంతో అమెరికాలో పెద్ద గొడవ జరుగుతోంది. దీనిపై ఆయన మాజీ భార్య మెలిండా(melinda-gates) ఫ్రెంచ్ గేట్స్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గట్టిగా మాట్లాడారు.

"ఈ విషయాలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. నా పాత పెళ్లి జీవితంలోని చేదు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఆ పత్రాల్లో ఉన్న తప్పుల గురించి నా మాజీ భర్తే సమాధానం చెప్పాలి. ఆ విషయాలతో నాకు సంబంధం లేదు, నేను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు" అని మెలిండా కుండబద్దలు కొట్టారు.

Also Read :  ఏఐ రంగంలో మరో సంచలనం.. ఆంత్రోపిక్ టూల్‌తో సాఫ్ట్‌వేర్‌ మార్కెట్లు ఢమాల్

Also Read :  ఉత్తర జపాన్‌ ను ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది దుర్మారణం

అసలు ఆ ఈమెయిల్స్‌లో ఏముంది?

ఎప్‌స్టీన్ రాసిన కొన్ని విషయాలు చూస్తుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బిల్‌ గేట్స్ వేరే మహిళలతో సంబంధాల కోసం ఎప్‌స్టీన్ సాయం కోరారట. రష్యన్ అమ్మాయిలతో తిరగడం వల్ల బిల్‌ గేట్స్‌కు STI అనే వ్యాధి సోకిందని, దానికి మందులు కావాలని ఎప్‌స్టీన్‌ను అడిగారట. అంతేకాదు, ఆ మందులను తన భార్య మెలిండాకు తెలియకుండా ఆమెకు కూడా ఇస్తానని గేట్స్ అన్నట్లు ఆ ఉత్తరాల్లో ఉంది.

అయితే ఈ ఆరోపణలను బిల్‌ గేట్స్ మనుషులు కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎప్‌స్టీన్ అనే వ్యక్తి కావాలనే బిల్‌ గేట్స్‌ను ఇరికించడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఈమెయిల్స్ రాశాడు. ఇందులో ఒక్కటి కూడా నిజం లేదని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా ఉన్న బిల్‌ గేట్స్ - మెలిండా విడిపోవడానికి ఇలాంటి కారణాలే ఉన్నాయని ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు