Space War: అంతరిక్షంలో యుద్ధం.. కొత్త కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ చైనా మాత్రం ఏకంగా అంతరిక్షంలోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. శత్రు దేశాలు అంతరిక్ష యుద్ధ శక్తిని పెంచుకుంటున్నాయని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది.

New Update
Space War

Space War

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ చైనా మాత్రం ఏకంగా అంతరిక్షంలోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. శత్రు దేశాలు అంతరిక్ష యుద్ధ శక్తిని పెంచుకుంటున్నాయని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది. చైనా ఉపగ్రహ కదలికలను బయటపెట్టింది. యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ (USSF) అనేది అంతరిక్షంలో అమెరికన్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన సైనిక విభాగం. దళాలను నిర్వహించడం, శిక్షణ ఇవ్వడం, సిద్ధం చేయడం దీని బాధ్యత. 

Also Read: మరోసారి దండకారణ్యంలో కాల్పుల మోత.. ఇద్దరు మావోయిస్టులు మృతి

 చైనా, రష్యా వంటి ప్రత్యర్థుల నుంచి అంతరిక్ష ఆధారిత ముప్పులను ఎదుర్కోవడానికి డొనాల్డ్ ట్రంప్ 2019లోనే దీన్ని స్థాపించారు. యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ దీనిగురించి మట్లాడారు. ఐదు చైనా ఉపగ్రహాల కదలికలు అధునాతన సైనిక వ్యూహాలను సూచిస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యాచరణ ఉపగ్రహాల మధ్య కక్ష్యలో పోరాటాలకు దారితీస్తుందని తెలిపారు. దీన్ని డాగ్‌ఫైటింగ్ అంటారని తెలిపారు. 

Also Read: ప్రపంచంలో హ్యాపీ దేశాల జాబితా విడుదల.. భారత్‌ ఏ స్థానమంటే ?

అంతేకాదు అంతరిక్షంలో గమనించిన చైనా ఉపగ్రహాల కార్యకలాపాలను జనరల్ గుట్లీన్ ప్రస్తావించారు. 2024లో చైనా మూడు షిజియాన్-24C ప్రయోగాత్మక ఉపగ్రహాలు, రెండు చైనీస్ ప్రయోగాత్మక అంతరిక్ష వస్తువులు, షిజియాన్-6 05A/B లతో వరుస మిషన్లను నిర్వహించింది. ఈ కార్యకలాపాలు భూ కక్ష్యలో గుర్తించారు. మరోవైపు చైనా, రష్యాలు తమ అంతరిక్ష బలగాలను పెంచుకుంటున్నాయని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. ఉపగ్రహాలు ఇంతకు ముందు ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయని.. కానీ ఒకేసారి బహుళ ఉపగ్రహాలను సమన్వయం చేయడం కీలక ముందడుగని పేర్కొంది . నివేదికల ప్రకారం, చైనా ఉపగ్రహాలు భూస్థిర కక్ష్యలో ఉన్న US శాటిలైట్లను పర్యవేక్షిస్తున్నాయని గుట్లిన్ అన్నారు. 

Also Read: మద్యం తాగేవాళ్లకి వారానికి రెండు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి.. ఎమ్మెల్యే డిమాండ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు