/rtv/media/media_files/2025/03/20/0Tz7H0ppZjoDJBpghSeV.jpg)
Finland is the happiest country in the world for the eighth year in a row
ఈమధ్యకాలంలో ప్రతీఒక్కరి జీవితాల్లో ఆందోళన, ఒత్తిడి అనేవి పెరిగిపోతున్నాయి. మనస్పూర్తిగా నవ్వుకునే పరిస్థితులు కూడా చాలామందిలో దూరమైపోయాయి. అయితే ఓ దేశం మాత్రం సంతోషకరమైన జీవితం గడపడంలో ఎప్పటికీ మందుంటోంది. వరుసగా ఎనిమిదోసారి కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటిస్థానంలో నిలిచింది. ఇంతకీ ఆ దేశం ఏంటి అని ఆలోచిస్తున్నారా ? అదే ఫిన్లాండ్. అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీలోని వెల్‌బీయింగ్ రీసర్చ్ సెంటర్ ఆనందకర దేశాల జాబితాను రిలీజ్ చేసింది.
Also Read: అంతరిక్షంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు?
ఈ జాబితాలో మరోసారి ఫిన్లాండ్ సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్‌లాండ్, నాలుగో స్థానంలో స్వీడన్ దేశాలు నిలిచాయి. ఇక భారత్‌కు ఈసారి 118వ ర్యాంక్ వచ్చింది. గతేడాది మనదేశం 126వ స్థానం దక్కించుగా.. ఈసారి కాస్త ముందుకెళ్లింది. ఇక చైనా 68వ స్థానంలో, పాకిస్థాన్ 109వ స్థానంలో చోటు సంపాదించి మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
Also Read: అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం
అమెరికాకు ఈ జాబితాలో 24వ స్థానం దక్కింది. పన్నెండేళ్ల క్రితం అగ్రరాజ్యం 11వ స్థానంలో ఉండేది. అప్పటినుంచి ప్రతీఏడాది దీని ర్యాంక్ పడిపోతూ వస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. సంపద, వృద్ధితో పాటు ఆత్మ సంతృప్తి, సంబంధాలు, మనుషుల మధ్య విశ్వాసం, స్వేచ్ఛ, జీవనకాలం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను తయారుచేశారు.
Also Read: ప్రజల్లోకి వెళ్లాలంటే....గన్ లెసెన్స్ ఇవ్వండి...పోలీసులకు ఆ ఎమ్మెల్యే లేటర్..
Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!