/rtv/media/media_files/2025/12/24/ys-jagan-2025-12-24-11-27-09.jpg)
YS Jagan
YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనారోగ్య కారణాలతో ఈరోజు నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆయనకు జ్వరం రావడంతో వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అందుకే ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.
Also Read: జగన్ కు అస్వస్థత.. ఇవాళ్టి పర్యటనలన్నీ రద్దు!
మంగళవారం బెంగళూరు నుంచి పులివెందులకు వచ్చిన జగన్, క్రిస్మస్ వేడుకల సందర్భంగా మూడు రోజులు అక్కడే ఉండాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే వచ్చిన తరువాత ఆయన ఆరోగ్యం మరింత బలహీనపడినట్టు సమాచారం.
Also Read: ట్రంప్ కంపు పనులు కవర్ చేస్తూ.. 30,000 పేజీల డాక్యుమెంట్ రిలీజ్
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి బయలుదేరి, 10.30 గంటలకు ఇడుపులపాయలోని ప్రార్థనా మందిరానికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేయాలనుకున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు పులివెందుల భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజా దర్బార్ నిర్వహించాల్సి ఉంది.
కానీ వాతావరణ మార్పులు, చలికాలం కారణంగా జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ కూడా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు ఆయనను పరీక్షించి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఈరోజు ఆయనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు. అయితే ఆయనను కలవాలని ఆశించిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆరోగ్యం మెరుగుపడిన తరువాతే తిరిగి కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Follow Us