Iran Israel War: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా సంచలన నిర్ణయం.. ‘ఇరాన్‌కి అణ్వాయుధాలు’

ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ ఛైర్మన్‌ దిమిత్రి మెద్వదేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ఫెయిల్ అయ్యాయని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ అన్నారు.

New Update
Dmitry Medvedev

ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ ఛైర్మన్‌ దిమిత్రి మెద్వదేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ఫెయిల్ అయ్యాయని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ అన్నారు. దాడి తర్వాత ఇరాన్ పాలన రాజకీయంగా బలపడిందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై శనివారం రాత్రి అమెరికా వైమానిక దాడుల చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌కు అణు వార్‌హెడ్‌లను సరఫరా చేయడానికి అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయని మెద్వెదేవ్ చెప్పుకొచ్చారు. ఇస్ఫహాన్, నటాంజ్, ఫోర్డో ఇరాన్ అణు స్వావరాలపై అమెరికా దాడులు స్వల్ప నష్టాన్ని మాత్రమే కలిగించాయని మెద్వెదేవ్ అన్నారు. ఇరాన్ రష్యా నుండి మద్దతు కోరింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరపడానికి మాస్కోకు వెళ్తానని పేర్కొన్నారు.

Also Read :  యుద్ధంలోకి నార్త్ కొరియా.. ఇరాన్‌కు నేనున్నానంటూ కిమ్

Dmitry Medvedev Says US Attacks On Iran

Also Read :  ఇరాన్‌పై అమెరికా సైనిక దురాక్రమణ యుద్ధాన్ని ఖండిస్తున్నాం

ఇరాన్‌కు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన వాటి పేర్లను  వెల్లడించలేదు. అణ్వాయుధాలను కలిగి ఉన్న రష్యా.. ఇజ్రాయెల్, అమెరికా దాడులను వ్యతిరేకిస్తుండటంతో ఇరాన్‌కు మాస్కో సాయం చేయనుందా అన్న ఊహాగానాలు వస్తున్నాయి. ట్రంప్‌ తీరుపైనా మెద్వదేవ్‌ విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో మరో యుద్ధం రావడానికి ట్రంప్‌ కారణమని ఆయన ఆరోపించారు.

Also Read :  బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే పరుగో పరుగు - ధర చాలా తక్కువ!

Also Read :  సీపీఐ మావోయిస్టు పార్టీలో ప్రక్షాళన...రంగంలోకి అగ్రనేత గణపతి

 

trump | iran nuke sites | america | latest-telugu-news | iran-isreal-war

Advertisment
Advertisment
తాజా కథనాలు