Sheikh Hasina: బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. యూనస్‌పై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా యూనస్ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. అక్రమ దోపిడీదారులు దేశ ప్రజలను బందీలుగా చేసుకున్నారని విమర్శించారు. యూనస్ ప్రభుత్వం అవినీతి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని మండిపడ్డారు.

New Update
Former Bangladesh PM Sheikh Hasina urges unity to save Bangladesh from darkness

Former Bangladesh PM Sheikh Hasina urges unity to save Bangladesh from darkness

బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హదీ(Sharif Osman Hadi) ని హత్య చేయడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ హత్య వెనుక యూనస్‌ ప్రభుత్వం హస్తం ఉందని ఇటీవల హదీ సోదరుడు ఆరోపించడం దుమారం రేపింది. దీంతో అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి కూడా నిరసన సెగ తగులుతోంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంతో తాజాగా దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా(sheik-hasina) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను అంధకారంలోకి నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.     

Also read: తైవాన్‌తో యుద్ధం వద్దు.. చైనాకు అమెరికా వార్నింగ్

Sheikh Hasina Urges Unity To Save Bangladesh

దేశాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పన్నిన వాళ్ల ముఖాలు బహిర్గతమయ్యాయని విమర్శించారు. అక్రమ దోపిడీదారులు దేశ ప్రజలను బందీలుగా చేసుకున్నారని విమర్శించారు. యూనస్ ప్రభుత్వం అవినీతి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని మండిపడ్డారు. విదేశీ పెట్టుబడిదారుల అభద్రతాభావం, ఉద్రిక్తతల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆరోపించారు. 

Also read: న్యూఇయర్‌ వేళ బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఇకనైనా పరిస్థితులు మరింత దిగజారకుండా జాగ్రత్త పడాలని సూచనలు చేశారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బంగ్లాదేశ్‌ ప్రజలందరూ దేశాన్ని రక్షించుకునేందుకు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారని.. ఏ దేశం కూడా బంగ్లాదేశ్‌ను గౌరవించడం లేదని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కలిసిమెలసి ఉండేవారని.. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు