/rtv/media/media_files/2026/01/02/taiwan-2026-01-02-09-30-39.jpg)
U.S. urges China to halt military pressure on Taiwan, days after Japan and others
తైవాన్, చైనా మధ్య ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మళ్లీ చెలరేగింది. ఇటీవల తైవాన్ జలసంధి చుట్టూ చైనా భారీగా యుద్ధ విన్యాసాలు చేయడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా అమెరికా స్పందించింది. చైనా సంయమనం పాటించాలని కోరింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగోట్ మాట్లాడారు. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు, బెదిరింపులకు పాల్పడితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతాయని అన్నారు.
Also Read: కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన.. ఈ ఏడాదికి మరో 12 వందేభారత్ రైళ్లు
U.S. Urges China To Halt Military Pressure On Taiwan
చైనా సంయమనం పాటించాలని.. తైవాన్‌పై సైనిక ఒత్తిడిని ఆపాలని కోరుతున్నామని చెప్పారు. దౌత్యమార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ఆశిస్తున్నామని తెలిపారు. తైవాన్ జలసంధి చుట్టూ శాంతి, స్థిరత్వానికి అమెరికా మద్దతిస్తోందని అన్నారు. చైనా బలవంతపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: గల్ఫ్ ఆధిపత్య పోరులో సౌదీ - UAE.. అప్పుడు స్నేహం, ఇప్పుడు వైరం ఎందుకంటే?
ఇదిలాఉండగా ఇటీవల తైవాన్ చుట్టూ చైనా భారీగా నౌక, వైమానిక దళాల విన్యాసాలు చేసింది. కేవలం రెండ్రోజుల్లోనే 130 యుద్ధ విమానాలు, 14 యుద్ధ నౌకలను మోహరించినట్లు తైవాన్ రక్షణశాఖ తెలిపింది. న్యూ ఇయర్ వేళ జాతినుద్దేశించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ను తిరిగి తీసుకునే ప్రక్రియ ఆగేది కాదన్నారు. చైనా విస్తరణవాదం నుంచి తమ దేశాన్ని రక్షించుకుంటామని పేర్కొన్నారు.
Follow Us