Blood Moon 2025: ఆకాశంలో అద్భుతం.. చంద్రగ్రహణం వీడియోలు, ఫొటోలు చూశారా?

2025 రెండవ చంద్రగ్రహణం ముగిసింది. ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వీక్షించారు. గ్రహణం ప్రారంభం నుంచి ముగింపు వరకు, అనేక ప్రాంతాలలో ఆకాశంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ఇప్పుడు ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

New Update
Blood Moon 2025 videos

Blood Moon 2025 videos

ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం నిన్న అంటే సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9.58 గంటలకు ప్రారంభమైంది. ఇది తెల్లవారుజామున 1.26 గంటల వరకు ఉంది. ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వీక్షించారు. గ్రహణం ప్రారంభం నుండి ముగింపు వరకు, అనేక ప్రాంతాలలో ఆకాశంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. చాలా మంది ఈ అరుదైన దృశ్యాలను తమ ఫోన్లలో, కెమెరాలలో రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. 

Blood Moon 2025 videos

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో.. భూమి నీడ చంద్రుడిపై పడి ఆకాశంలో వింత దృశ్యాలు కనిపించాయి. గ్రహణం ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే, చంద్రుడు ఎరుపు రంగులోకి మారడం మొదలైంది. దీనినే ‘బ్లడ్‌ మూన్’ అని కూడా పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు.

కాగా ఈ గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. కేవలం సాధారణ కళ్లతో చూడొచ్చు. అయితే చాలామంది ఖగోళ ప్రేమికులు టెలిస్కోపులు, బైనాక్యులర్లను ఉపయోగించి మరింత స్పష్టంగా వీక్షించారు. ఇక ఈ గ్రహణాన్ని వీక్షించిన చాలామంది తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అందుకు సంబంధించి వీడియోలు, ఫోటోలు, లైవ్ స్ట్రీమ్‌లు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేల సంఖ్యలో షేర్ అవుతున్నాయి. కొంతమంది యూట్యూబర్లు ఈ గ్రహణాన్ని లైవ్ స్ట్రీమ్ చేసి, వారి సబ్‌స్క్రైబర్లతో అనుభవాలను పంచుకున్నారు. 

అయితే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, గ్రహణం సమయంలో కొన్ని సంప్రదాయాలను పాటించారు. దేవాలయాలను మూసివేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటివి చేశారు. అయినప్పటికీ ఈ గ్రహణం ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. ప్రజలు తమ వీక్షణలను, అభిప్రాయాలను పంచుకోవడంతో సోషల్ మీడియాలో ఈ గ్రహణం ఒక ట్రెండింగ్ అంశంగా మారింది. #LunarEclipse2025, #ChandraGrahan, #BloodMoon2025 వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు