Floods: భారీ వరదలు.. 17 మంది మృతి

అఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు సంభవించాయి. దీని ప్రభావంతో 17 మంది మ-ృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. డిసెంబర్ 29 నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి.

New Update
Flash floods triggered by heavy rains in Afghanistan kill at least 17 people

Flash floods triggered by heavy rains in Afghanistan kill at least 17 people

అఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు సంభవించాయి. దీని ప్రభావంతో 17 మంది మ-ృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. డిసెంబర్ 29 నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వరదల ధాటికి పలు పశువులు కూడా చనిపోయినట్లు తెలిపారు. మొత్తంగా 1800 కుటుంబాలపై ఈ వరదల ప్రభావం పడినట్లు చెప్పారు. 

Also Read: కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన.. ఈ ఏడాదికి మరో 12 వందేభారత్‌ రైళ్లు

Floods Triggered By Heavy Rains In Afghanistan

హెరాత్‌ ప్రావిన్స్‌లోని కబ్కాన్ జిల్లాలో గురువారం ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.  ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వరద తీవ్రతను అంచనా వేసేందుకు టీమ్‌లను కూడా పంపించినట్లు పేర్కొన్నారు. 

Also Read: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

ఇదిలాఉండగా అఫ్గానిస్థాన్‌లో చాలా కాలంగా వర్షాలు పడటం లేదు. కరవు పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా భారీగా వర్షాలు కురిశాయి. అయినప్పటికీ వరదలు సంభవించడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. గతంలో కూడా అఫ్గాన్‌లో భారీగా వరదలు సంభవించి అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. 

Advertisment
తాజా కథనాలు