/rtv/media/media_files/2025/12/29/chinese-military-2025-12-29-13-20-45.jpg)
Chinese military to stage drills around Taiwan to warn ‘external forces’ after tensions with U.S. and Japan
చైనా, తైవాన్(china-vs-taiwan) మధ్య వివాదం ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జపాన్ ప్రధాని సనాయె తకాయిచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరుదేశాల మధ్య మరోసారి అగ్గిని రాజేశాయి. తైవాన్‌ను రక్షించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే చైనా దళాలు తైవాన్‌ను చుట్టుముట్టనున్నాయి. అక్కడ భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటన చేశాయి. దీంతో చైనా ఎయిర్‌ఫోర్స్, నేవీ, రాకెట్ ఫోర్స్‌ను తైవాన్ సమీపంలోకి తరలించేందుకు పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
చైనాకు చెందిన పీఎల్‌ఏ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ సీనియర్ కర్నల్ షి యీ దీనిపై మాట్లాడారు. తాము జస్టిస్ మిషిన్ 2025 పేరుతో తైవాన్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటన చేశారు. సముద్ర, గగనతల యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకోవడం, ద్వీప సమూహాల వెలుపల బ్లాకేడ్స్ నిర్వహించడం వంటివి చేయనున్నట్లు పేర్కొన్నారు. తైవాన్‌లోని వేర్పాటువాద శక్తులకు ఇది బలమైన హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చైనా తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా ఇటీవల తైవాన్‌కు ఆయుధాలు విక్రయిస్తామని అమెరికా ప్రకటించింది. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. దీంతో 20 అమెరికా రక్షణ రంగ సంస్థలు, 10 మంది ఎగ్జిక్యూటివ్‌లపై ఆంక్షలు విధించింది.
Also Read: పిల్లల పెంపకంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
Chinese Military To Stage Drills Around Taiwan
చైనా-తైవాన్ వివాదం ఎన్నోఏళ్ల నుంచి ఉంది. తైవాన్ మా దేశంలో భాగమని చైనా వాదిస్తోంది. మరోవైపు తమది స్వతంత్ర దేశమని తైవాన్ అంటోంది. ఈ భూభాగం విషయంలోనే ఇరుదేశాల మధ్య గొడవలు సాగుతూ వస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. చైనాలో గతంలో మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీకి, చియాంగ్ కై-షేక్ నేతృత్వంలోని నేషనలిస్ట్ పార్టీ (కుమింటాంగ్) మధ్య యుద్ధం జరిగింది. 1927లో మొదలైన ఈ అంతర్యుద్ధం 1949 వరకు జరిగింది. చివరికి ఈ యుద్ధంలో కమ్యూనిస్టులు విజయం సాధించడంతో ఓడిపోయిన నేషనలిస్టులు అక్కడి నుంచి తైవాన్ ద్వీపానికి పాకిపోయారు. అక్కడే పారిపోయి అక్కడ తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
చైనా వన్ చైనా పాలసీని బలంగా నమ్ముతోంది. తైవాన్ అనేది చైనాలోని భాగమేనని పదేపదే చెబుతూ వస్తోంది. అవసరమైతే యుద్ధం చేసైనా తైవాన్‌ను తమ దేశంలో కలుపుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చాలాసార్లు హెచ్చరించారు. తైవాన్ మాత్రం తమను తాను స్వతంత్ర దేశంగా భావిస్తోంది. అంతేకాదు అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం కూడా ఏర్పడింది. తైవాన్‌కు సొంత రాజ్యాంగం, కరెన్సీ, మిలటరీ ఉంది. అక్కడి యువత కూడా తాము చైనీయులం కాదని.. తైనానీయులమని చెప్పుకుంటారు.
Also Read: భారత్‌పై విషం కక్కిన బంగ్లాదేశ్.. ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేస్తామంటూ హెచ్చరిక
1945 నుంచి 1971 వరకు తైవాన్ ఐక్యరాజ్యసమితిలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉండేది. భద్రతా మండలీలో కూడా శాశ్వత సభ్యత్వం ఉండేది. అయితే 1971లో ఐక్యరాజ్యసమితి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం మెయిన్‌ల్యాండ్ చైనాను మాత్రమే చైనాకు ఏకైక ప్రతినిధిగా గుర్తించింది. ఆ తర్వాత తైవాన్‌ను బహిష్కరించింది. దీంతో అప్పటినుంచి తైవాన్ UN సభ్యదేశంలో లేదు. ప్రపంచవ్యాప్తంగా చైనా ఆర్థిక, రాజకీయ ఒత్తిడి వల్ల అనేక దేశాలు తైవాన్‌తో అధికారిక రాయబార సంబంధాలను తెంచుకున్నాయి. కేవలం 12 దేశాలు మాత్రమే తైవాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నాయి. అందులో వాటికన్ సిటీ, పరాగ్వే, హైతీ, మార్షల్ ఐలాండ్స్ తదితర దేశాలు ఉన్నాయి.
Follow Us