Elon Musk: ఆ కంటెంట్‌ను తొలగిస్తాం.. ఎక్స్‌ కీలక ప్రకటన

ఎక్స్‌లో రోజురోజుకు అశ్లీల కంటెంట్‌ పెరిగిపోవడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ సంచలన ప్రకటన చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌లో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తే దాన్ని పూర్తిగా తొలగిస్తామని పేర్కొంది.

New Update
Elon Musk's X To Remove Illegal Content, Permanently Ban Offending Users

Elon Musk's X To Remove Illegal Content, Permanently Ban Offending Users

ప్రముఖ సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రోజురోజుకు అశ్లీల కంటెంట్‌(Remove Illegal Content) పెరిగిపోవడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ సంచలన ప్రకటన చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌లో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తే దాన్ని పూర్తిగా తొలగిస్తామని పేర్కొంది. అలాగే వాటిని అప్‌లోడ్‌ చేసే అకౌంట్‌లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని తేల్చిచెప్పింది. స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నామని పేర్కొంది. ఎక్స్‌ గ్లోబల్ గవర్నమెంట్‌ అఫైర్స్‌ అకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.  

Also Read: రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం.. వందలాది బైకులు బుగ్గి!

Elon Musk's X To Remove Illegal Content

 ఏఐ గ్రోక్‌ను వినియోగించి అశ్లీల కంటెంట్‌చేసేవారిపై చర్యలు తీసుకుంటామని గతంలో కూడా ఎలాన్ మస్క్‌(Elon Musk) హెచ్చరించారు. ఆ తర్వాత దీనిపై  గ్లోబల్‌ గవర్నమెంట్‌ అఫైర్స్‌ కూడా స్పందించింది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ ఉన్న అకౌంట్లను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఎక్స్‌ రూల్స్‌కు సంబంధించిన లింక్‌ను కూడా షేర్ చేసింది.   

Also Read: వెనెజువెలా పని అయిపోయింది..ఇక మిగిలింది క్యూబా, మెక్సికో ,కొలంబియానే..ట్రంప్ హెచ్చరిక

మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎక్స్‌లో పెరుగుతున్న అశ్లీల కంటెంట్‌ను గుర్తించింది. గ్రోక్‌ ఏఐని వినియోగించి మహిళల అసభ్యకర ఫొటోలను సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే జనవరి 2న ఎక్స్‌ దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. గ్రోక్‌తో రూపొందించిన అసభ్యకర కంటెంట్‌ను తొలగించాలని తెలిపింది. అంతేకాదు దీనిపై ఓ సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. 

Advertisment
తాజా కథనాలు