Musk: భారత్, చైనా దేశాల్లో జనాభా క్షీణత.. ఎలాన్‌ మస్క్‌ ఆందోళన

భారత్‌ తో పాటు చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్రమంగా క్షీణించడంపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో జనాభా క్షీణత ఒకటని మస్క్‌ చెప్పుకొచ్చాడు.

New Update
Elon musk

Elon Musk : భారత్‌ తో పాటు చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా  పలు దేశాల్లో జనాభా క్రమంగా క్షీణించడంపై అపర కుబేరుడు, టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటని మస్క్‌ చెప్పుకొచ్చాడు. అయితే, జనాభా క్షీణత అంచనాకు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను టెస్లా ఓనర్స్‌ సిలికాన్ వ్యాలీ ఎక్స్‌ లో పోస్ట్‌ చేసి వివరించింది.

Also Read: Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి

Also Read: Saniya Mirza: తల్లిదండ్రులు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు..సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!

జనాభా అధికంగా క్షీణిస్తూ..

నైజీరియా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్థాన్‌, భారత్ (India), చైనా సహా మరి కొన్ని కీలక దేశాల్లో 2018-2100 నడుమ జనాభాలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనే దాన్ని అందులో చూపించారు.అయితే, ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా గుర్తింపు పొందిన చైనా, భారత్‌లో 2100 నాటికి జనాభా అధికంగా క్షీణిస్తూ ఉంటుందని టెస్లా ఓనర్స్‌ సిలికాన్ వ్యాలీ వేసిన గ్రాఫ్ లో స్పష్టంగా కనపడుతుంది.

ఈ గ్రాఫ్‌ను పోస్ట్‌ చేస్తూ.. జనాభా తగ్గుదల మానవాళికి అత్యంత ప్రమాదంగా ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పేర్కొన్నాడని  టెస్లా ఓనర్స్‌ సిలికాన్‌ వ్యాలీ తాను షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొంది. దీనికి మస్క్‌ రియాక్ట్ అవుతూ.. ‘అవును’ అని పెట్టి ఆ గ్రాఫ్‌ను రీపోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also Read: Konstas: బుమ్రాతో కొన్‌స్టాస్ గొడవ.. చివరి బంతికే వికెట్, కోహ్లీ రియాక్షన్ చూశారా!

Also Read:Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు!

Advertisment
తాజా కథనాలు