Elan Musk: ట్రంప్ పై అసహనంగా ఉన్న మస్క్‌..కారణం ఏంటో తెలుసా!

ఓపెన్‌ ఏఐ, సాఫ్ట్‌ బ్యాంక్‌, ఒరాకిల్‌ సంయుక్తంగా భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టును చేపట్టాయి. కానీ, దీనిపై ట్రంప్ మద్దతుదారుడు, ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Trump-Musk:  నా కేబినెట్‌ లో మస్క్‌: ట్రంప్‌!

టెక్‌ దిగ్గజాలు ఓపెన్ ఏఐ, సాఫ్ట్‌ బ్యాంక్‌,ఒరాకిల్‌ సంయుక్తంగా స్టార్ట్ గేట్‌ పేరుతో చేపట్టిన ప్రపంచంలోనే  అతిపెద్ద కృత్రిమ మేధ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను ట్రంప్ సమర్దించడంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ఈ కంపెనీ 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని ట్రంప్ చేసి ప్రకటనపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

Also Read: East Godavari: రాజమండ్రి గామన్‌ వంతెన పై ట్రావెల్ బస్సు బోల్తా..యువతి మృతి..18మందికి సీరియస్‌!

అంతమొత్తం వాళ్ల దగ్గర లేదని మస్క్‌ అన్నారు. సాఫ్ట్ బ్యాంకు మొత్తం విలువ 10 బిలియన్ డాలర్ల కంటే తక్కువగానే ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు మస్క్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మెగా ప్రాజెక్ట్ పట్ల ఆయన ఒకింత అసహనంగా ఉన్నట్టు ఆయన చేసిన ట్వీట్ చెబుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు మస్క్ మద్దతుగా ఉన్న సంగతి, ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

24 గంటల్లోనే...

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను ట్రంప్ ప్రశంసించడంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే వైట్‌హౌస్‌లో ట్రంప్ ఈ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏఐ సాయంతో ప్రాణాంతక క్యాన్సర్‌ను కూడా నయం చేసే వ్యాక్సిన్‌ను 48 గంటల్లోనే తయారుచేయవచ్చని దిగ్గజ కంపెనీలు వెల్లడిస్తున్నాయి. 

Also Read:  EPFO: తగ్గనున్న అధిక ఫించన్‌..స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌ఓ!

ఈ కార్యక్రమంలో ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌, ఒరాకిల్ సీఈఓ ల్యారీ ఎల్లిసన్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ సీఈఓ మసయోషి సన్‌ కూడా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా టెక్సాస్‌లోని అతిపెద్ద డేటా సెంటర్ల సాయంతో కృత్రిమ మేధలో సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం టెక్సాస్‌లో 10 డేటా సెంటర్లను ఇప్పటికే నిర్మించారు. త్వరలోనే ఈ సంఖ్యను 20కి పెంచనున్నారు. 

ఈ ప్రాజెక్ట్ ద్వారా అమెరికాలో లక్షలాది ఉద్యోగాల సృష్టించవచ్చని ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు. ఏఐ సాయంతో క్యాన్సర్‌ త్వరగా గుర్తించడంతో పాటు నయం చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనపై ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు.

వచ్చే నాలుగేళ్లలో స్టార్ట్‌గేట్ ప్రాజెక్ట్ కోసం 500 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నామని, తక్షణమే 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నామని ఓపెన్ ఏఐ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌కు మస్క్ రిప్లయ్ ఇస్తూ.. ‘‘అంత మొత్తం వాళ్ల దగ్గర లేదు.. సాఫ్ట్ బ్యాంకు మొత్తం విలువ 10 బిలియన్ డాలర్ల కంటే తక్కువే ఉందని .. దీని గురించి  నాకు పూర్తి సమాచారం ఉందని మస్క్‌ చెప్పుకొచ్చారు.

శామ్ అల్ట్‌మన్‌, ఎలాన్ మస్క్ కలిసి ఓపెన్ఐఏ సంస్థను 2015లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, విబేధాలతో 2018లో మస్క్ బయటకు వచ్చారు. ఇటీవల తరుచూ ఓపెన్ఏఐపై మస్క్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆ సంస్థలో నాలుగేళ్ల పరిశోధకుడిగా పనిచేసి భారతీయ అమెరికన్ సుచీర్ బాలాజీ అనుమానాస్పద మృతిపై కూడా మస్క్ స్పందించారు. దీని వెనుక ఓపెన్ఏఐ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.

Also Read: Sukumar: సుకుమార్ ఇంటిపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. రెండో రోజు కూడా

Also Read: BREAKING NEWS : మిమల్ని చంపేస్తాం.. బాలీవుడ్ నటులకు పాక్ షాక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు