/rtv/media/media_files/2025/06/11/2djWWs3dUllepJjb9c6u.jpg)
Elon Musk Says He Regrets His Posts About Donald Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. మస్క్ ఏకంగా కొత్త పొలికల్ పార్టీనే ప్రకటిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేయడం సంచలనం రేపింది. అయితే తాజాగా మరో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. ట్రంప్‌పై చేసిన ఆరోపణలపై ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ పోస్టులపై విచారం వ్యక్తం చేస్తున్నానని.. అవి చాలా దూరం వెళ్లాయంటూ రాసుకొచ్చారు. ఈ వ్యవహారంలో మస్క్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరి మధ్య మళ్లీ సంధి కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక AXIOM-4 ప్రయెగం మళ్లీ వాయిదా
అమెరికా సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలాన్ మస్క్ వ్యతిరేకించాడు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సెక్స్ స్కామ్‌లో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే దర్యాప్తులోని విషయాలు బయటపడలేదని విమర్శలు చేశారు. అలాగే ట్రంప్‌ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టును మస్క్ సమర్ధించారు. అలాగే తన సపోర్ట్ లేకుంటే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారంటూ కూడా మస్క్ ఆరోపించారు.
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
అయితే ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. మస్క్ లేకున్నా కూడా తాను పెన్సిల్వేనియాలో గెలిచేవాడినని తెలిపారు. అలాగే మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టుకు, రాయితీలకు కోత వేస్తానంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే మస్క్ చేసిన పోస్టులపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇటీవల ఆయన వాటిని తొలగించారు. తాజాగా మళ్లీ తాను ట్రంప్‌పై చేసిన పోస్టులకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: మండుతున్న అమెరికా..ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన లాస్ ఏంజెలెస్ నిరసనల సెగ