Elon Musk - Trump: నా వల్ల కాదు.. బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుపై ఎలాన్ మస్క్

అమెరికా ప్రభుత్వం నుంచి టెక్ అధిపతి ఎలాన్ మస్క్ తప్పుకున్నారు డోజ్ బాధ్యతలను వదులుకున్నారు. అయితే అంతకు ముందు నుంచే ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇది ఒక చెడ్డ బిల్లు అని ఆయన అన్నారు.

New Update
 Elon Musk and Trump

Elon Musk - Trump

Elon Musk - Trump: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెమిటెన్స్‌లపై అంటే అమెరికా(USA) నుంచి విదేశాలకు డబ్బులు పంపించడంపై 3.5 శాతం ఎక్సైజ్ సుంకం విధించే బిల్లును తీసుకువచ్చారు. దీనికి బిగ్ బ్యూటిఫుల్ బిల్(Big Beautiful Bill) అని పేరు పెట్టారు.  ఇది అమెరికాకు వలస వెళ్ళిన ప్రతీవారికీ వర్తిస్తుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదా H1B వీసాపై పని చేయడానికి అక్కడికి వెళ్లిన ప్రతి వలసదారునికి ఈ కొత్త రూల్ వర్తించనుంది.  దీని వల్ల దాదాపు 4 కోట్ల మంది వలసదారులు ప్రభావితమవుతారని అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..

అదో చెత్త బిల్లు..

అమెరికా సెనేట్ లో ఈ బిల్లుకు ఒక్కరు తప్ప మొత్తం అందరూ ఆమోదం తెలిపారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఎలాన్ మస్క్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. డోజ్ నుంచి వైదొలక ముందు నుంచీ మస్క్ ఈ బిల్లు మంచిది కాదని చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మరోసారి స్పందించారు. ఇది ఒక చెడ్డ బిల్లు అని, దీని కారణంగా అమెరికన్లపై అధిక భారం పడుతుందని అన్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను. ఇది అత్యంత దారుణమైనది. కాంగ్రెస్‌లో తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చాలా చెడ్డదని వ్యాఖ్యానించారు. ఇది చాలా తప్పు అని నాకు తెలుసు అంటూ పోస్ట్ లో రాసారు. దీనికి దాదాపు సెనేట్ మొత్తం ఓటు వేశాంటే అది ప్రభుత్వానికే అవమానం అని మస్క్ అన్నారు. ఈ బిల్లు కారణంగా ద్రవ్యలోటు 2.5 ట్రిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు.

Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

ఎలాన్ మస్క్ స్పందనపై వైట్ హౌస్ రియాక్ట్ అయింది. అతనిని నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదని అన్నారు. అయితే తమకు అది ముందుగానే తెలుసునని..అయినా కూడా బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ అభిప్రాయాన్ని మార్చలేదని ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లివిట్‌ చెప్పారు. పైగా ఈ బిల్లు గొప్పదని చెప్పుకొచ్చారు. ఈ బిల్లుపై మస్క్‌ చేసిన వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయని హౌస్ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించారు. 

Also Read: USA: స్టీల్, అల్యూమినిమంపై 50 శాతం సుంకాలు...ఇవాల్టి నుంచే అమలు

Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు