Rajat Patidar: కెప్టెన్ మారాడు కథ మారింది..

పద్దెనిమిదేళ్ళ ఆర్సీబీ కల ఈ ఇయర్ నెరవేరింది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చి వెళ్ళారు..కెప్టెన్లు మారారు. కానీ ఈ ఏడాది కెప్టెన్ అయిన రజత్ పాటీదార్ ఒక్కడికే కప్ ను గెలిచిన ఘనత దక్కింది. 

New Update
ipl

RCB captain Rajat Patidar

ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఈ ఏడాది తన కెప్టెన్ ను మార్చింది. యంగ్ ప్లేయర్ రజత్ పాటీదార్ ను సారథిగా చేసింది. అదే టీమ్ కు కలిసి వచ్చింది. ఆర్సీబీ జట్టును విజయాల వైపు నడిపించడంలో రజత్ సక్సెస్ అయ్యాడు. కెప్టెన్ గానే కాక బ్యాటర్ గా కూడా టీమ్ కు విజయాలను అందించాడు. మహామహులు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, డానియల్ వెటోరీ లాంటి వారికి సాధ్యం కాని దాన్ని చేసి చూపించాడు. బెంగళూరుకు కప్ ను సాధించిపెట్టాడు రజత్. 

కెప్టెన్ గా ఫుల్ క్రెడిట్స్..

ఈ సీజన్ బెంగళూరు మొదటి నుంచి కన్సిస్టెంట్ గా ఆడింది.బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో సమిష్టి రాణించింది. మధ్యలో భారత్, పాక్ యుద్ధం కారణంగా మ్యాచ్ లు ఆగిపోయాయి. ఏబీడీ విలియర్స్ లాంటి వాళ్ళు వెళ్ళి పోయారు. అయినా కూడా ఎక్కడా జట్టు స్థైర్యం దెబ్బ తినకుండా ముందుకు నడిపించాడు రజత్. క్వాలిఫయర్ 1 లో పంజాబ్ ను చిత్తుగా ఓడించేలా చేశాడు. తరువా ఫైనల్స్ లో కూడా తన కెప్టెన్సీ పవర్ ను చూపించాడు. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఒకానొక సమయంలో పంజాబ్ దూకుడుగా పరుగులు చేసింది.  ఆ టైమ్ లో బౌలర్లను సరిగ్గా రోటేట్ చేస్తూ వికెట్లను రాబట్టుకునేలా ముందుండి నడిపించాడు రజత్ పాటీదార్. ఐపీఎల్ ఛాంపియన్ గా బెంగళూరు నిలవడంలో రజత్ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. 

Advertisment
తాజా కథనాలు