Zelensky VS Musk: పిల్లలు చచ్చిపోతుంటే.. మీకు ఫొటో షూట్ లా!

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే.. భార్యతో కలిసి ఫొటోషూట్‌ చేసుకుంటావా? అంటూ ఫైర్ అయ్యారు.

New Update
Zelenskyy

Zelenskyy

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే.. భార్యతో కలిసి ఫొటోషూట్‌ చేసుకుంటావా? అంటూ ఫైర్ అయ్యారు.ఉక్రెయిన్-రష్యా మధ్య గత మూడేళ్ల నుంచి భీకర యుద్ధం సాగుతోంది. యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు, పిల్లలు చనిపోగా.. ఆస్తులు ధ్వంసమయ్యాయి. 

Also Read: iPhone 16e: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే ఛాన్స్.. 16 సిరీస్‌లో 16e మోడల్.. ధర ఇంత తక్కువా..!

తాజాగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా రష్యా-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ లేకుండానే అమెరికా చర్చలు జరుపుతోంది.ఇదిలా ఉంటే 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా.. సైనికులు, పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే.. జ్ఞానంగా మసులుకోవాల్సిన జెలెన్ స్కీ.. భార్య ఒలెనా జెలెన్ స్కీతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. 

Also Read: Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్!

Elon Musk Fires On Zelenskyy Photoshoot

ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్ ఈ ఫొటోలను తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ ఫొటోషూట్ సమయం, సందర్భం తెలుసుకుని ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో జెలెన్ స్కీ‌పై విరుచుకుపడ్డారు. యుద్ధం సమయంలో ఇవేం పనులంటూ నిలదీశారు. జెలెన్ స్కీ తీరును గతంలో రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళా లారెన్ బోబర్ట్, టెక్సాస్ కాంగ్రెస్ మహిళా మైరా ఫ్లోర్స్ కూడా తప్పుపట్టారు.

ఇదేం తీరు అంటూ ప్రశ్నించారు. మేము మానవతా దృక్పథంతో సాయం చేస్తుంటే.. జెలెన్ స్కీ మాత్రం.. తమను పిచ్చోళ్లను చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఫొటోషూట్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రంప్ ఇప్పటికే మాట్లాడుతూ.. జెలెన్ స్కీ.. ఒక నియంత అని.. ఇప్పటి వరకు ఎన్నికలు జరపలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లేకుండానే శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని జెలెన్ స్కీ తప్పుపట్టారు.

Also Read: TG News: జగన్‌తో విందు కోసం తెలంగాణకు అన్యాయం చేశారు.. మంత్రి సంచలన కామెంట్స్!

Also Read:  Satwik Sairaj: కొడుకుకి ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న పురస్కారం..కానీ ఇంతలోనే తండ్రి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు