TG News: జగన్‌తో విందు కోసం తెలంగాణకు అన్యాయం చేశారు.. మంత్రి సంచలన కామెంట్స్!

వైఎస్ జగన్‌తో విందు, వినోదాల కోసం తెలంగాణకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పదేండ్ల పాటు కేసీఆర్, హారీష్ రావు ఏపీ జల దోపిడీకి సహకరించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వారి జేబులు నింపుకున్నారన్నారు. 

New Update
Uttam kumar Reddy

Minister Uttam Kumar Reddy

TG News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో దోస్తీ కోసం గత ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జగన్ తో విందు, వినోదాలు చేసుకుని లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయేలా చేశారన్నారు. ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు మాత్రం నిండాయన్నారు. కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తి వైఫల్యం చెందారు. కృష్ణా వాటర్ లో తెలంగాణకు అన్యాయం జరగొద్దని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు తాను వివరించినట్లు తెలిపారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారని మండిపడ్డారు.

అన్యాయన్ని సరి చేయలేదు..

ఏపీ జల దోపిడీకి సహకరించారు. పదేండ్ల పాటు తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు.
Slbc టన్నెల్ పనులను పూర్తి స్థాయిలో కంప్లిట్ చేస్తాం. కృష్ణాలో గత పాలకుల అసమర్ధత కారణంగా తెలంగాణకు కేటాయింపులు 299 టీఎంసీలు ఉంటే కేవలం 180 టీఎంసీలు మాత్రమే వాడగలిగారు. ఏపీ పునర్వివిభజన చట్టంలో సాగునీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయన్ని సరి చేయలేదు. కేసీఆర్, హరీష్ రావు పలు మార్లు జరిగిన సమావేశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగేలా చేశారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Manipur Governor: అప్పటిలోగా ఆయుధాల్ని అప్పగించండి.. లేకపోతే.. మణిపుర్‌ గవర్నర్‌ హెచ్చరిక

నీటి కేటాయింపులపై తాము వచ్చాకే సరి చేస్తున్నామని చెప్పారు. Go 203తో ప్రతీరోజు 3 టీఎంసీలు తరలించేలా జగన్ చేసిన ప్రయత్నాలకు సహకరించారన్నారు. ఆఖరికి ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను కూడా ఏపీకి సహకరించేలా వ్యవహరించారు.
రాయలసీమ లిఫ్ట్ పనుల కోసం ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేశారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్లను కూడా తామే ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కాళేశ్వరం కూలితే స్వయంగా ndsa రంగంలోకి దిగి విచారణ చేపట్టిందని చెప్పారు.

ఇది కూడా చదవండి: AP News: ఇష్టంవచ్చినట్లు చేస్తానంటే కుదరదు.. ఆ నేతకు సీఎం సీరియస్ వార్నింగ్!

బేసిక్ విచారణలోనే ప్రాజెక్టు డిజైన్ తప్పు ఉందని ndsa స్పష్టం చేసినట్లు తెలిపారు. నీళ్లు నింపవద్దని స్వయంగా ndsa లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. అయినా ప్రాజెక్టుల్లో కమీషన్ కోసం 12 శాతం వడ్డీకి రుణాలు తెచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టుల రుణాలను నెగోషియేట్ చేసి 7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు