/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/satwik-sairaj-jpg.webp)
satwik sai raj
భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథ్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఢిల్లీలో సాత్విక్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కరాం అందుకోనుండటంతో ఆ కార్యక్రమానికి హాజరయ్యేంఉదకు భార్యతో కలిసి ఆయన గురువారం అమలాపురంలోని ఇంటి నుంచి బయల్దేరారు.
అయితే కాసేపటికే కారులో కుప్పకూలిపోయారు. ఆయన్ని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా..అప్పటికే విశ్వనాథ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య రంగనాయకి ఉపాధ్యాయురాలు కాగా పెద్ద కొడుకు చరణ్ తేజ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు.
Also Read: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ .. 15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్ !
కుమారుడికి ఓనమాలు...
చరణ్ స్వదేశం చేరుకున్న తరువాత విశ్వనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాశీ విశ్వనాథ్ క్రీడాకారుడిగా స్థిరపడాలని భావించి చివరికి వ్యాయామ ఉపాధ్యాయుడు అయ్యారు. తన కలను కుమారుడి ద్వారా సాకారం చేసుకునేందుకు బ్యాడ్మింటన్ ఆడేందుకు అమలాపురంలోని ఆఫీసర్స్ క్లబ్ కు విశ్వనాథ్ వెళ్లేవారు. అప్పటికీ ఆరేళ్ల వయసున్న సాత్విక్ ను తండ్రి తీసుకెళ్లేవారు. అక్కడే బ్యాడ్మింటన్ లో కుమారుడికి ఓనమాలు నేర్పించారు. అతడి ఎదుగుదలలో అడుగడుగునా అండగా నిలిచారు.
ఆయన కుమారుడిని తీర్చిదిద్దడం నుంచి స్థానికంగా క్రీడలకు ప్రోత్సాహం అందించడం వరకు ఆయన నిరంతరం కృషి చేశారని పలువురు కొనియాడారు. ఆయన హఠాత్తుగా చనిపోవడంతో ఆయన సేవలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా వృత్తి ప్రారంభించిన ఆయన పదోన్నతి పొంది ఎ.వేమవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 2018లో ఉద్యోగ విరమణ చేశారు.
అమలాపురంలో డిగ్రీ , నాగ్‌పూర్ లో బీపీడీ, ఎంపీడీ చదివారు. ఆయన అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ కార్యదర్శిగా కోనసీమ బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శిగా , ఒలింపిక్ జిల్లా సంఘ గౌరవాధ్యక్షుడిగా , ఆజాద్ ఫౌండేషన్ , కోనసీమ ఐకాస, జిల్లా రెడ్‌క్రాస్,వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యుడి గా, వ్యాయామ ఉపాధ్యాయుల జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పని చేశారు.
ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ కు రూ.10 లక్షలు అందజేశారు. విద్యార్థులను షటిల్ బ్యాడ్మింటన్ లో తీర్చిదిద్దడానికి ఆఫీసర్స్ క్లబ్ పక్కన 20 సెంట్ల స్థలం కొన్నారు. విద్యార్థులకు క్రీడల్లో నైపుణ్యం పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్ గా ముందుకు దూసుకుపోండి!