Egg smuggling: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు

అమెరికాలో కోడిగుడ్లకు కరువచ్చింది. కెనడా, మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాకు కోడిగుడ్లు రవాణా చేస్తున్నారు. గతకొన్నేళ్లుగా బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ ఉత్పత్తులు USలో బాగా పడిపోయాయి. దీంతో డ్రగ్స్ కంటే 10 రెట్లు కోడిగుడ్లే స్మగ్లింగ్ జరురుగుతున్నాయి.

New Update
eggs smuggling in US

eggs smuggling in US Photograph: (eggs smuggling in US)

ఇప్పటి వరకూ మీరు గోల్డ్, డ్రగ్స్ లేదా ఆయుధాలు స్మగ్లింగ్ చేయడం చూసి ఉంటారు. కానీ అమెరికాలో కోడి గుడ్ల అక్రమంగా రవాణా చేస్తున్నారట. డ్రగ్స్ కంటే 10 రెట్లు కోడిగుడ్లే స్మగ్లింగ్ జరురుగుతున్నాయిని అధికారుల నివేధికలు చెబుతున్నాయి. కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా కోడిగుడ్లు తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్నారు. కొద్ది నెలలుగా ఇలాంటి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అసలు అగ్రరాజ్యం అమెరికాలో కోడిగుడ్లకు కొదువేంటి? ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో చూద్దాం..

బర్డ్‌ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి.

Also read:Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

అమెరికాలో గుడ్ల వినియోగం ఎక్కవగా ఉంటుంది. కానీ వాటి అవసరాలకు తగ్గట్టుగా సరపరా లేదు. దీంతో దొడ్డిదారిన కెనడా నుంచి అమెరికాకు కోడిగుడ్లు వస్తున్నాయి. 2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్‌ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం.

Also read: నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు

2024 అక్టోబర్‌ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో 352 సార్లు ఫెంటానిల్ పట్టుబడితే.. 3,768కి పైగా పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డాయి. అమెరికాలో గుడ్లు కొనలేని పరిస్థితిలో ఉన్న వారు కోళ్లను అద్దెకు తీసుకొచ్చుకుంటున్నారు. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్‌ ద చికెన్‌ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆరు నెలలపాటు కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు