/rtv/media/media_files/2025/10/20/trump-2025-10-20-14-41-21.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను మరోసారి హెచ్చరించారు. రష్యా చమురు కొనుగోళ్లు ఆపేంతవరకు భారత్ తమకు భారీ టారిఫ్‌లు కట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. రష్యా చమురును కొనుగోలు చేయమని భారత్ అంగీకరించిందని ఇటీవల ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే తాజాగా మళ్లీ ఈ అంశం గురించే ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా చమురు కొనుగోళ్లపై ఆయన వ్యాఖ్యలను భారత్ ఖండించిన విషయాన్ని విలేకరులు ప్రశ్నించారు.
Also Read: ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్ హత్యకు మరో కుట్ర.. చెట్టుపై నుంచి స్కోప్!
దీనికి స్పందించిన ట్రంప్ భారత్ ఒకవేళ అలా చెప్పాలనుకుంటే భారీ స్థాయిలో టారిఫ్‌లు చెల్లిస్తూనే ఉంటారని అన్నారు. కానీ భారత్ అలా చేయదని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇదిలాఉండగా గత వారం ట్రంప్ వైట్‌హౌస్‌లో ఈ అంశం గురించి మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ఇప్పటికీ చమురు కొనుగోలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీతో నేను మాట్లాడని.. రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ట్రంప్-మోదీ మధ్య అలాంటి సంభాషణ జరగలేదని పేర్కొంది. ఇంధన కొనుగోళ్ల అంశంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే తాము ప్రాధాన్యం ఇస్తుంటామని స్పష్టం చేసింది.
President Trump says India will have to "keep paying lot of tariff" if it buys Russian energy; Restates that PM Modi said "he will not be doing Russian oil thing" pic.twitter.com/4VQT9lSr9j
— Sidhant Sibal (@sidhant) October 20, 2025
Also Read: నిరసనకారులపై బురద చల్లిన ట్రంప్.. AIతో అమెరికా అధ్యక్షుడి వింత శేష్టలు
ఇక అమెరికా-భారత్ మధ్య జరిగిన వాణిజ్య చర్చలు కూడా జరిగాయి. ఇరు దేశాల మధ్య వైరుధ్యాల చాలావరకు తగ్గాయని.. మరికొన్ని రోజుల్లో సానుకూల నిర్ణయాలు వెల్లువడే అవకాశాలు ఉన్నాయని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు గతవారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని టీమ్ అమెరికాలోని వాషింగ్టన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే రష్యా చమురు కొనుగోళ్లు విషయంలో భారత్‌ను హెచ్చరిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి.
Also Read: పాక్ ప్రధాని దీపావళి శుభాకాంక్షలు.. ఏమని ట్వీట్ చేశాడో తెలుసా?