/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక- 2026(world-economic-forum) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్ ఐల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న తన కోరికను మరోసారి బయటపెట్టాడు. అమెరికా తప్ప మరే దేశమూ గ్రీన్‌లాండ్‌కు రక్షణ కల్పించలేదని స్పష్టం చేశారు. దావోస్ వేదికగా ప్రపంచ దేశాధినేతల సమక్షంలో ప్రసంగించిన ట్రంప్, గ్రీన్‌లాండ్‌ను అమెరికా భూభాగంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. "గ్రీన్‌లాండ్‌ను రక్షించే సామర్థ్యం అమెరికాకు తప్ప మరే ఇతర దేశానికి లేదా దేశాల సమూహానికి లేదు. ఇది కేవలం అమెరికా జాతీయ భద్రతకే కాదు, ప్రపంచ భద్రతకు కూడా అత్యంత కీలకం" అని ఆయన పేర్కొన్నారు.
గ్రీన్‌లాండ్(Greenland) ప్రస్తుతం డెన్మార్క్ పరిధిలో ఉన్నప్పటికీ, అక్కడ రక్షణ వ్యవస్థలు చాలా బలహీనంగా ఉన్నాయని ట్రంప్(47th us president donald trump) విమర్శించారు. "రష్యా, చైనాల యుద్ధ విమానాలు, జలాంతర్గాములు అక్కడ తిరుగుతుంటే.. వారి వద్ద కేవలం రెండు కుక్కల బండ్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆ ద్వీపాన్ని ఎలా రక్షించుకోగలరు?" అని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read : Intelligence Agencies Alert: ఢిల్లీలో హై అలర్ట్.. కోడ్ నేమ్ 2026తో ఉగ్రదాడులకు ప్లాన్!
Donald Trump Says Only America Can Save Greenland
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో డెన్మార్క్ కేవలం ఆరు గంటల్లోనే జర్మనీకి లొంగిపోయిందని, అప్పట్లో అమెరికానే తన బలగాలను పంపి గ్రీన్‌లాండ్‌ను రక్షించిందని గుర్తు చేశారు. యుద్ధం తర్వాత దానిని తిరిగి ఇచ్చేయడం అమెరికా చేసిన "తెలివితక్కువ పని" అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్ అంశంలో అమెరికాకు వ్యతిరేకంగా నిలుస్తున్న ఐరోపా దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌లాండ్ కొనుగోలుకు మద్దతు ఇవ్వని ఎనిమిది ఐరోపా మిత్రదేశాలపై 10 శాతం నుంచి 25 శాతం వరకు సుంకాలు విధిస్తానని ఇప్పటికే ఆయన హెచ్చరించారు.
ఈ మధ్యే ట్రంప్ ఒక AI రూపొందించిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో గ్రీన్‌లాండ్‌పై అమెరికా జెండా ఉండి, "US Territory - Est. 2026" అని రాసి ఉంది. ఇది అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను దుమారం రేపింది. గ్రీన్‌లాండ్ విషయంలో ఎవరూ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని, దావోస్ పర్యటనలో ఇతర దేశాధినేతలతో దీనిపై చర్చలు జరిపి ఒక పరిష్కారానికి వస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ స్పందన
ట్రంప్ వ్యాఖ్యలపై డెన్మార్క్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్‌లాండ్ "అమ్మకానికి లేదు" అని డెన్మార్క్ ప్రభుత్వం తేల్చి చెప్పగా, ట్రంప్ చర్యలను "కొత్త వలసవాదం"గా ఐరోపా దేశాలు అభివర్ణిస్తున్నాయి. గ్రీన్‌లాండ్ అంశం వల్ల నాటో (NATO) కూటమిలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : 27 ఏళ్ళ చారిత్రక ప్రయాణానికి ముగింపు.. రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్
Follow Us