Donald Trump: నేను ఈత కొట్టుకుంటూ వెళ్లాలంటున్నారా

అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.ఈ ప్రమాదంలో 67 మంది మృతి చెందారు.ఈ క్రమంలో ట్రంప్‌ ప్రెస్‌మీట్‌ లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ట్రంప్‌ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.

New Update
Donald Trump

Donald Trump

అగ్రరాజ్యం అమెరికా (America) లో ఓ విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్న విషయం అందరికీ తెలిసిందే. అలా ఆ రెండు ఢీకొన్ని వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. గాల్లోనే అవి బూడిద అయిపోయాయి. ఆపై వెంటనే నదిలో కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో  67 మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా దీనిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే ఓ విలేకరి ప్రమాద జరిగిన స్థలాన్ని పరిశీలించాలనుకుంటున్నారా అని అడగ్గా.. నన్ను ఈతకు వెళ్లమంటున్నారా అంటూ ట్రంప్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

Also Read: BIG BREAKING: మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటి సంచలన ప్రకటన

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పీఎస్ఏ ఎయిర్ లైన్స్‌కు చెందిన బొంబార్డియన్ CRJ700 విమానం కన్సాస్ నుంచి వాషింగ్టన్‌లోని రీగన్ విమానాశ్రయానికి వస్తోంది.. అదే సమయంలో ఆర్మీ హెలికాప్టర్ స్కిరోస్కీ హెచ్-60 గాల్లో విన్యాసాలు చేస్తోంది. అయితే పౌర విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడంతో ఆ విమానం రన్‌వే పైకి వచ్చేందుకు రెడీ అయ్యింది. 

Also Read: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!

Donald Trump Responds To Reporter

అదే సమయానికి మిలిటరీ హెలికాప్టర్ ఈ మార్గంలోకి రాగా.. రెండూ ఒక దానిని ఒకటి ఢీకొన్నాయి. ఈక్రమంలోనే పెద్ద ఎత్తులో మంటలు  వ్యాపించి గాల్లోనే అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆపై ఒక్కసారిగా అటు విమానం, ఇటు హెలికాప్టర్ కింద ఉన్న పొటామాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉండగా.. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీరంతా ప్రాణాలు కోల్పోగా.. పొటామాక్ నదిలో వీరి మృతదేహాలు కూడా దొరికాయి.

ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ (Donald Trump).. కంట్రోల్ రూమ్ సిబ్బందిదే తప్పంటూ మండిపడ్డారు. అయితే తాజాగా మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించిన ట్రంప్‌నకు ఓ విలేకరి.. మీరు ప్రమాద స్థలాన్ని సందర్శించాలనుకుంటున్నారా అని అడిగాడు. అయితే దీనికి సరైన సమాధానం చెప్పకుండా ట్రంప్.. నన్ను ఈతకు వెళ్లమంటారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

ఆ తర్వాత కాస్త కోపం తగ్గించుకుని.. ప్రమాదం వల్ల మృతుల కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా చాలా బాధ పడ్డానని చెప్పుకొచ్చారు. అయితే ప్రమాద స్థలాన్నిపరిశీలించకపోయినా.. త్వరలోనే బాధిత కుటుంబ సభ్యుల్లో కొందరిని కలుస్తానని వివరించారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఓ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

Also Read: Elon Musk: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Also Read: Gongadi Trisha: టీ-20 మ్యాచ్ మ్యాచ్ గెలిపించిన గొంగడి త్రిష.. సీఎం రేవంత్ ఏమన్నారంటే ?

Advertisment