/rtv/media/media_files/2025/02/02/tqVCR90IqSmXs7CVBt9V.jpg)
Cricketer Gogadi Trisha and CM Revanth Reddy
రెండోసారి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. అలాగే ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి టీమిండియా గెలపునకు కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
''మలేషియా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చారు. దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు.
Also Read: రూ.12లక్షల దాకా నో ట్యాక్స్ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే: నిర్మలా సీతారామన్
గొంగడి త్రిష లాంటి క్రీడాకారులకు తెలంగాణకు గర్వ కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటూ భరోసా ఇచ్చారు'' అని తెలంగాణ సీఎంవో ఎక్స్‌లో రాసుకొచ్చింది.
వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి @revanth_anumula గారు అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ #GongadiTrisha గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
— Telangana CMO (@TelanganaCMO) February 2, 2025
మలేషియా… pic.twitter.com/1HCC2O6zs5
Also Read: ఇదేం ట్విస్టురా మామా.. ఆ పాటకు వరుడు డ్యాన్స్ చేశాడని పెళ్లి క్యాన్సిల్
ఇదిలాఉండగా టీమిండియాకు అండర్ 19 టీ20 వరల్డ్ కప్ అందించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. 19 ఏళ్ల త్రిష 7 మ్యాచ్లలో కలిపి 309 పరుగులు చేసి జట్టుకు కప్ రావడంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసింది కూడా గొంగడి త్రిషనే కావడం విశేషం. కేవలం బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ త్రిష అదరగొట్టింది. 7 వికెట్లు తీసింది. ఈ క్రమంలో గొంగడి త్రిష బ్యాక్ గ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.